లాక్‌డౌన్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలి

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

పశ్చిమ గోదావరి: లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో మంత్రి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల దుకాణాలతో పాటు, మెడికల్‌ షాపులను సందర్శించారు. షాపుల దగ్గర ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని దుకాణాల యజమానులకు సూచించారు. భౌతిక దూరంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలమన్నారు. వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top