తాడేపల్లి: బిడ్డల భవిష్యత్ పట్ల తల్లిదండ్రుల కంటే మిన్నగా..ముఖ్యమంత్రి వైయస జగన్ మోహన్ రెడ్డి మేనమామ బాధ్యతలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళలు, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు.
స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదరికంతో బాధపడుతున్న మహిళలు, బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి నమస్కారం.
ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మనం అందించే న్యాప్‌కిన్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నాం. ఎడ్యుకేషన్,హెల్త్, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాధారణంగా బాలికలకు 11వ సంవత్సరం నుంచి రుతుక్రమం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో బాలికలు బాల్యం నుంచి యవ్వనదశలోకి ప్రవేశిస్తారు. ఈ దశలో వారిలో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. మానసికంగా, శారీరకంగా చాలా మార్పులు వస్తుంటాయి. ఈ సమయంలో వారికి వ్యక్తిగత శుభ్రత అన్నది చాలా అవసరం.
ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారికి గైడ్ చేయాలి. ముఖ్యంగా తల్లి గైడ్ చేయాల్సి ఉంటుంది. ఏ వి«దంగా నడుచుకోవాలని తల్లి మాత్రమే నేర్పుతుంది. వ్యక్తిగత శుభ్రత కోసం మన ప్రభుత్వం ఉచితంగా న్యాప్‌కిన్లు అందించే కార్యక్రమం ప్రారంభించడం చాలా గొప్ప విషయం.. ఆనందించదగ్గ విషయం..పిల్లల పట్ల తల్లి ఏరకంగా శ్రద్ధ తీసుకుంటుందో..ఆ విధంగా పిల్లల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రిగా ..తల్లి కంటే మిన్నగా ..ఒక మేనమామగా ఉచితంగా న్యాప్‌కిన్లు అందించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.
ఇంతటి భృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న సీఎం వైయస్ జగన్‌కు ఏ విధంగా మాటలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. పేదరికం వల్ల కానీ, అవగాహన లేకపోవడం, కొంత మంది సాంప్రదాయపద్దతులు పాటించకపోవడంతో శానిటరీ న్యాప్‌కిన్లు వాడకపోవడంతో ఇన్‌ఫెక్సన్లు వస్తుంటాయి. ఈ సమయంలో వారి ఇబ్బందులు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ ఆందోళన వారి చదువుపై ప్రభావం చూపుతుంది. చాలా మంది పిల్లలు రుతుక్రమం సమయంలో స్కూళ్లకు వెళ్లకుండా, క్లాస్‌లు వినకుండా, చదువులపై శ్రద్ధ చూపకపోవడం, యాక్టివిటిస్‌లో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులను మీరు గ్రహించి, సంతోషకరమైన, ఉత్సాహకరమైన వాతావరణం కల్పించేందుకు మన ప్రభుత్వం నుంచి బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందించాలనే కాన్సెప్ట్ గొప్పది. ఒక తల్లికన్నా ఎక్కువగా సీఎం వైయస్ జగన్ ఓ మేనమామలా ఆలోచన చేయడం గొప్ప విషయం. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్..
గత ప్రభుత్వాలలో స్కూళ్లలో టాయిలెట్లు ఉండేవి కావు. బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండేవి కావు. మీరు సీఎం అయ్యాక..నాడు–నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లలో బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించారు. ఈ రోజు శానిటరీ న్యాప్‌కిన్స్ రాష్ట్రంలో 10 లక్షలు అందజేస్తున్నాం. ఒక్కొ అమ్మాయికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 న్యాప్‌కిన్లు అందజేస్తున్నాం. స్కూళ్లలో ఒక మహిళా టీచర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నాం. నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బాలికలకు న్యాప్‌కిన్లు అందజేస్తున్నాం. న్యాప్‌కిన్లు ఎలా ఉపయోగించాలి, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలని ఆ నోడల్ ఆఫీసర్ బాలికల్లో అవగాహన కల్పిస్తారు.
వైయస్‌ఆర్ చేయూత స్టోర్లలో ఈ న్యాప్‌కిన్లు పెడుతున్నాం. రాష్ట్రంలో 67 వేల వైయస్‌ఆర్ చేయూత స్టోర్లు ఉన్నాయి. ఒక్కో న్యాప్‌కిన్ విలువ రూ.4 నుంచి 6 రూపాయలు ఉంటాయి. ఇలాంటివి మనం స్కూళ్లు అమ్మాయిలకు ఉచితంగా అందజేస్తున్నాం. అలాగే ఈ స్టోర్ల ద్వారా మహిళలకు తక్కువ ధరకే అందజేస్తున్నాం. త్వరలోనే స్టోర్లలోకి అందుబాటులోకి తీసుకువస్తాం.
శానిటరీ న్యాప్‌కిన్లు పీ అండ్ జీ, నైన్ అనే కంపెనీలతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం తీసుకుంటుంది. అక్టోబర్, నవంబర్ ఈ రెండు నెలలకు కలిపి 1,98, S87120 స్కూళ్లకు పంపించాం. 28 లక్షల ప్యాకెట్లలో సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నాం.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మహిళలు, బాలికలు, గర్భిణుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఏడాదికి రూ.1800 కోట్లు ఈ పథకాలకు సీఎం వైయస్ జగన్ కేటాయిస్తున్నారు.
గతంలో ఇలాంటి కార్యక్రమాలు లేవు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ..మహిళలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆరోగ్యం, ఆహారం అందిస్తున్నారు.
దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. కేంద్రంలో ఈ చట్టం కొంత పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపేందుకు సీఎం వైయస్ జగన్ చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ మహిళలకు ఒక వరంలా మారింది. ఈ యాప్ ద్వారా చాలా మంది మహిళలు రక్షించుకోగలిగారు.
విద్యా రంగంలో వినుత్నాత్మకమైన, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పిల్లలు బడికి పంపిస్తే వారి ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు జమ చేసి ప్రోత్సహిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు మంచి కాన్సెçప్ట్‌తో పాలన అందిస్తున్నారు. పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇవ్వలేని భవిష్యత్‌ను సీఎం వైయస్ జగన్ ఇస్తున్నారు. ప్రతిదీ ఖరీదైనదే..వైయస్ జగన్ ఉచితంగా అందిస్తూ వెలుగులు నింపే కార్యక్రమాలు చేపడుతూ ఒక మేనమామలా బాధ్యతలు తీసుకుంటున్నారు.
ఆడపిల్లల వ్యక్తిగత శుభ్రత గురించి కోట్లు ఖర్చు చేసి, చక్కటి బ్రాండెండ్ న్యాప్‌కిన్లు అందిస్తూ..వారి చదువు, భద్రత పట్ల సీఎం వైయస్ జగన్ అన్ని విధాల ఆలోచన చేస్తున్నారు. అందరికీ అండగా ఉంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సీఎం వైయస్ జగన్‌కు అందరి తరఫున మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలిపారు.