పోష‌క ప‌దార్థాలు అందించేలా చ‌ర్య‌లు

  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
 

ప‌శ్చిమ గోదావ‌రి: గర్భిణిలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేల చూసి, వారికి అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు   స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరులోని లిటరి క్లబ్‌లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్‌ను నిర్వహించింది. ఓఎన్‌జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ స్టాల్‌లో ఐసీడీఎస్‌ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది.  మంత్రి తానేటి వనిత స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్‌వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను, పలకలను పంపిణీ చేశారు.

Back to Top