అమరావతి యాత్రలో రైతులు లేరు

మంత్రి తానేటి వనిత

ఏలూరు: అమరావతి పేరిట చేస్తున్న పాదయాత్రలో నిజమైన రైతులు ఎవరు లేరని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ దళారులు చేస్తున్న యాత్ర అది అని మంత్రి అభివర్ణించారు. యాత్రకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తున్నారని ఆమె చెప్పారు. పోలీసులు అడ్డుకుంటే యాత్ర ఇంతకాలం సాగేదా అని మంత్రి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు యాత్రకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ముసుగులో అమరావతిలో పొలాలు కొన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రమే యాత్ర చేస్తున్నారు. ఎక్కడా కూడా పోలీసులు అడ్డుకున్నది లేదని మంత్రి స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top