గుంటూరు న‌డిబొడ్డున గుర్రం జాషువా క‌ళాప్రాంగ‌ణం

జాషువా ఘాట్ అభివృద్ధి, ఆడిటోరియం ఏర్పాటుకు రూ.3 కోట్లు విడుద‌ల‌

అంబేడ్క‌ర్‌, జాషువా విగ్ర‌హాల అభివృద్ధికి సీఎం నిర్ణ‌యాలు చాలా గొప్ప‌వి

విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

అమ‌రావ‌తి: గుర్రం జాషువా గొప్ప‌త‌నాన్ని భావిత‌రాల‌కు తెలియ‌జేసేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. గుంటూరు న‌డిబొడ్డున గుర్రం జాషువా క‌ళా ప్రాంగ‌ణం అభివృద్ధికి సీఎం చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. మంత్రి ఆదిమూల‌పు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గుర్రం జాషువ స్మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రూ.3 కోట్ల నిధులు విడుద‌ల చేశార‌న్నారు. జాషువా క‌ళా ప్రాంగ‌ణం కోసం గుంటూరు న‌డిబొడ్డున కోట్ల రూపాయ‌ల విలువైన స్థ‌లం కేటాయించార‌న్నారు. జాషువా ఘాట్ అభివృద్ధి, ఆడిటోరియం ఏర్పాటు కోసం రూ.3 కోట్లు మంజూరు చేశార‌న్నారు. అంతేకాకుండా సెప్టెంబ‌ర్ 28న జాషువా జ‌యంతికి సాహిత్య పుర‌స్కారాన్ని తెలుగు అకాడ‌మీ ద్వారా అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు. గుర్రం జాషువా గొప్ప‌త‌నాన్ని భావిత‌రాల‌కు తెలియ‌జేసేందుకు సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. విజ‌య‌వాడ న‌డిబొడ్డున అంబేడ్క‌ర్ విగ్ర‌హం, గుంటూరు న‌డిబొడ్డున జాషువా క‌ళా ప్రాంగ‌ణం అభివృద్ధికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. అంబేడ్క‌ర్‌, జాషువా విగ్ర‌హాల అభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాలు చాలా గొప్ప‌వ‌న్నారు. సీఎం నిర్ణ‌యంపై ద‌ళితులంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారన్నారు.

Back to Top