మహిళా రక్షణకు కట్టుబడి ఉంటాం

 మంత్రి సుచరిత 

 

మహిళా మిత్ర

ఆంధ్రప్రదేశ్ పోలీసుల చొరవలో భాగంగా చేపట్టిన కార్యక్రమం మహిళా మిత్ర. సమాజం ఆలోచనలను మార్చుతూ, సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రత్యేకించి యువత, బాలలకు అవగాహన కల్పించి మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. సీఐడీ మహిళా రక్షణ విభాగపు అదనపు SP రాష్ట్ర నోడల్ అధికారిగా ఉండగా, డిప్యూటీ ఎస్పీ లేదా మహిళా సీఐ, మహిళా డిప్యూటీ ఎస్పీ జిల్లా నోడల్ అధికారిగా ఉండటం జరుగుతుంది. 

ప్రతి పోలీస్టేషన్ లో ఇద్దరు పోలీసుల అధికారులను మహిళా మిత్ర సమన్వయ కర్తలుగా చేసి దాని లక్ష్యాలు, ఉద్దేశ్యాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 

మహిళా మిత్ర సమన్వయ కర్తలు మహిళలు, బాలల సమస్యల పట్ల అవగాహన, ప్రాధాన్యతా పరంగా సేవాబలం కల మహిళావాలంటీర్లు, ప్రఖ్యాతి గాంచిన ఎన్జీవో సభ్యులు, ఉపాధ్యాయులతో ప్రతి గ్రామం, వార్డు కోసం ఒక కమిటీ చొప్పున మహిళామిత్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ కమిటీల్లో గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. 

వీరి విధులు - మహిళలు,బాలలకు సంబంధించిన అంశాలు గుర్తించడం. పోలీస్ స్టేషన్ కు సత్వరమే నివేదిక అందించడం. పోలీస్ సమన్వయ కర్తలతో పాటుగా సమావేశాలు నిర్వహించడం, స్థానిక ప్రజలకు చట్టాలు నియమావళి, కార్యవిధానాల గురించి అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బాడ్ టచ్, బాలల లైంగిక దుర్భాష గురించిపిల్లల్లో అవగాహన కల్పించడం. హెల్ప్ లైన్లను ఉపయోగించడంపై అవగాహన. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బెల్టు షాపులు, గేమింగ్ విధులు, పని ప్రదేశాలలో వేధింపుల గురించి సమాచారం ఇవ్వడం ఈ కమిటీల బాధ్యత. 

 

సైబర్ మిత్ర

ఆపదలో ఉన్న మహిళలను తక్షణమేరక్షించడం కోసం ప్రత్యేక వాట్స్ అప్ నెంబర్ 9121211100ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల్లో విశ్వాసం నింపేందుకు బహిరంగ ప్రచారాలు, అవగాహానా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు తీసుకునేందుకు వీలుగా, మహిళలపై జరిగే నేరాలపై కేసుల తక్షణ నమోదు కోసం అన్ని పోలీస్ స్టేషన్లు, స్టేషన్ హౌజ్ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇవ్వడం జరిగింది. 0FIR నమోదు చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి  మహిళలపై నేరాల కేసులు సత్వర పరిష్కారం కోసం, ఇప్పుడు ఉన్న 13 జిల్లాలకు 13 కోర్టులతో పాటు, వీటికి అదనంగా అక్టోబర్ 2 నుండి మరో 8 ఫాస్ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయి. మహిళా హెల్ప్ లైన్ కోసం 112 ఏకైక అత్యవసర హెల్ప్ లైన్, అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ ద్వారా  పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య ఇతర హెల్ప్ లైన్లు కలిసి ఉంటాయి. 181 ద్వారా మహిళా హెల్ప్ లైన్ పథకం సార్వత్రీకరణ కింద ఆంధ్రప్రదేశ్ కోసం ఈ నెంబరు ఏర్పాటు చేసారు. అత్యవసర సేవలు పోలీసుల 100, అగ్నిమాపక 101, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఆసుపత్రి, అంబులెన్సు కోసం 108, అత్యవసర స్పందన సర్వీసులు 112, ఉచిత న్యాయ సేవలకు నల్సా హెల్ప్ లైన్ 181 తో ఏకీకృతం చేయడం జరిగింది. ఈ పథకానికి నిర్భయ నిధి నుండి నిధులు సమకూర్చడం జరుగుతోంది. మహిళా పోలీస్ వాలంటీర్లు జెండర్ సమస్యలపై పోలీసుల అందుబాటును సులభం చేయడానికి, స్థానిక పరిధిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, సాధికారత గల బాధ్యతాయుతమైన, సామాజిక అవగాహన కలిగిన మహిళలను mpvలుగా నియమించడమైంది. mpvలు మహిళలపై జరిగే నేరాలు ఎదుర్కోడానికి పబ్లిక్ పోలీస్ ఇంటర్ ఫేస్ గా సేవలు అందిస్తారు. బాల్య వివాహాలు, గృహ హింస, వరకట్నం వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కునే హింస వంటి, హింసాత్మక ఘటనలు నివేదించడం మహిళా పోలీస్ వాలంటీర్ కర్తవ్యం. వీరు సమాజానికి ఆదర్శంగా ఉంటారు. వైయస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వీరి పని తీరు చాలా బావుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క జిల్లాలో 1500 మంది మహిళా పోలీస్ వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఏపీలో మానవ రవాణా నిరోధక యూనిట్లు, ఏపీ మహిళాభ్యుదయం శిశు సంక్షేమ శాఖ సభ్యులు, ప్రఖ్యాతిగాంచిన ఎన్జీవోల సభ్యుల సాయంతో వ్యక్తుల రవాణా అరికట్టడం, అవసరమైనప్పుడు ఏలూరు, గుంటూరు, అనంతపూరులో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ప్రకటించడం జరిగింది. పదే పదే అవే నేరాలకు పాల్పడే వారిని నిర్బంధించాలని, ఫోస్కో నేరస్తులపై హిస్టరీషీట్ తెరవాలని యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

Read Also: మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం 

Back to Top