రఘురామకృష్ణంరాజుకు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తాం

మంత్రి శ్రీరంగనాథరాజు 
 

విజ‌య‌వాడ‌: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మా పార్టీ ఎంపినే అని, ఆయ‌న‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని మంత్రి శ్రీ‌రంగ‌నాథ‌రాజు పేర్కొన్నారు.  ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా తమ ప్రభుత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సహకారం అందజేస్తామని తెలిపారు. 15 లక్షల మంది ప్రజలకు ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా తగిన భద్రత ఏర్పాటు చేస్తామని, గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. ప్రాణహాని ఉందంటున్న ఎంపీ, ఇదేమీ ఫ్యాక్షన్ ఏరియా కాదన్న విషయం గుర్తించాలని అన్నారు. 

Back to Top