ఇళ్ల నిర్మాణంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది

మంత్రి శ్రీరంగనాథరాజు

31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌దే

30 లక్షల కుటుంబాలకు నాణ్యమైన గృహాలు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం

ఇళ్ల నిర్మాణాలపై దుష్ప్రచారం మానుకోండి

10 రోజులకు ఒకసారి సీఎం వైయస్‌ జగన్‌ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష

దరఖాస్తు చేసుకునున 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇస్తాం

చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క సెంటు భూమి ఇచ్చారా?

జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం

రూ.1200 కోట్లతో కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాం

 పశ్చిమ గోదావరి: ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని, 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు.  ఇంత పెద్ద ఎత్తున ఇళ్లు కట్టే యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పూర్వజన్మ సుకృతమన్నారు. ఎవరైనా సలహాలు ఇస్తే స్వాగతిస్తామన్నారు. ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

దేశ చరిత్రలో ఒకేసారి 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది సీఎం వైయస్‌ జగనే . రాష్ట్రంలో 1750 జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులతో ఆప్షన్లు తీసుకున్నాం. ఆప్షన్‌ 3లో ఉన్న 20 మంది లబ్ధిదారులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఇళ్లు నిర్మిస్తాం. ప్రతి జిల్లాకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాతున్నాం. రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని సీఎంవైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మెటిరీయల్‌ కింద రూ.1.20 లక్షలు ఇస్తున్నాం. సిమెంట్, ఇసుక తక్కువ రేటుకు ఇస్తున్నాం. 340 అడుగుల ఇళ్లు నిర్మిస్తున్నాం. మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌..31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 

చంద్రబాబు ఏ ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇ చ్చారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఓర్వలేక రామోజీ, రాథాకృష్ణలను వాడుకుని దుప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని అప్రతిష్టపాలు చేయాలని కుట్రలు చేస్తున్నారు. అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. జగనన్న కాలనీల్లో రూ.32 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. తాగునీటి వసతి కల్పించాం. సిమెంట్, ఐరన్, ఫ్యాన్లు, బల్బులు ఇస్తున్న  మనసున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఈ యజ్ఞంలో పాలు పంచుకున్న అందరికీ పూర్వజన్మ సుకృతం. మా లక్ష్యాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నెరవేర్చితీరుతాం. 

పేషేంట్లు, వికలాంగులు ఉంటారు. అలాంటి వారు ఇళ్లు కట్టుకునేందుకు ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి సీఎం వైయస్‌ జగన్‌ ఇళ్లు నిర్మిస్తారు. ఈ రోజు ఇళ్ల నిర్మాణంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. రూ.1.10 లక్షల కోట్లు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి హెచ్చిస్తోంది. ఈ రోజు 31 లక్షల కుటుంబాలను లక్షాధికారులను చేశాం. ప్రతి రోజు జగనన్న కాలనీలలో పర్యటిస్తున్నాం. ఎల్లోమీడియా దుష్ప్రచారం మానుకోవాలి. ఆ రోజు ఎన్టీఆర్, ఇందిరమ్మ, వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వారిని మించి సీఎం వైయస్‌ జగన్‌ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు కూడా ఇళ్లు కట్టిస్తామని సీఎం వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు. 

కరోనా నేపథ్యంలో ఎకానమీ బూస్ట్‌ను ఇళ్ల నిర్మాణం ద్వారా పెంచాం. సిమెంట్, ఇటుక నిర్మాణ సంస్థల్లో పనులు పెరిగాయి. సామగ్రి ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇళ్లు కట్టేందుకు గౌండలు కూడా రేట్లు పెంచుతున్నారని మా దృష్టికి వచ్చింది. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని ఏర్పాటు చేశాం. 40 కిలోమీటర్ల లోపు ఇసుక అందుబాటులో ఉంచాం. ఇసుక రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. గృహ నిర్మాణాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. తప్పుడు కథనాలు రాయడం మానుకోండి మంత్రి హితవు పలికారు. 
 

Back to Top