బాబు ఏనాడైనా వెనుకబడిన వర్గాలకు మేలు చేశాడా..?

బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది

గాజువాకలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు

గాజువాక: మత్స్యకారుడు పార్లమెంట్‌లో అడుగుపెట్టాడంటే అందుకు కారణం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ విధంగా అమలవుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక భరోసాను సీఎం వైయస్‌ జగన్‌ కల్పించారన్నారు. గాజువాకలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. 

బడుగు, బలహీనవర్గాలకు చంద్రబాబు ఏనాడైనా మేలు చేశాడా అని ప్రశ్నించారు.  బాబుకు బానిసత్వం చేసేవారే టీడీపీలో మిగిలారన్నారు. తోకలు కత్తిరిస్తా, తాట తీస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు సైతం రాశాడన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. జనసైనికుల కష్టాన్ని చంద్రబాబుకు పవన్‌ అమ్మేస్తున్నాడన్నారు. 

Back to Top