బోటెక్కితేనే మత్స్యకారుల సమస్యలు తెలుస్తాయా పవన్‌..?

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 

మత్స్యకారులకు ఏం చేశావని నీ యజమాని బాబును నిలదీయ్‌..

14 ఏళ్ల సీఎంగా బాబు ఎన్ని పోర్టులు, హార్బర్‌లు కట్టాడో అడుగు

చంద్రబాబు ఒక్క పోర్టుకైనా చిన్న ఇటుక ముక్క వేశాడా..? 

బాబును నిలదీయలేని నీకు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిది..? 

విజనరీ జగన్ గారైతే...సైకో చంద్రబాబు: మంత్రి శ్రీ సీదిరి అప్పలరాజు

వైయ‌స్‌ఆర్‌ గారి హయాంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులొచ్చాయి

వైయ‌స్ జగన్‌ గారి హయాంలోనే రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టు పనులు

మత్స్యకారుల పెన్నిధిగా జగన్‌గారు

2024 తర్వాత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తెరమరుగవడం ఖాయం

 తేల్చిచెప్పిన మంత్రి  సీదిరి అప్పలరాజు

ఈ రాష్ట్రంలో అరాచకశక్తులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లే

చంద్రబాబు పూర్తిగా నిరాశతో, ఆక్రోశంతో మాట్లాడుతున్నాడు

 ఇద్దరూ ఒకే స్క్రిప్ట్ చదువుతూ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు

 రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు పెట్టే పని పెట్టుకున్నారు. 

 బాబూ చేష్టలకు 23 నుంచి రెండుమూడు స్థానాలకు పడిపోవడం ఖాయం

 మంత్రి  సీదిరి అప్పలరాజు ఫైర్‌

తాడేప‌ల్లి: బోటెక్కితేనే మత్స్యకారుల సమస్యలు తెలుస్తాయా పవన్‌..? అంటూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్ర‌శ్నించారు. అసలు, నీకు మత్స్యకారుల గురించి ఏం తెలుసు పవన్‌కళ్యాణ్‌..? ఒక్కసారి లైఫ్‌జాకెట్‌ వేసుకుని బోటెక్కితేనే సమస్యలు తెలిసిపోతాయా..? మరి, సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే ఈది, సముద్రంలోనే చేపలు పట్టేందుకు పనిచేసిన మాలోంటోళ్ల పరిస్థితేంటి..? మాకేమీ తెలియదనా..? అదేమంటే, మత్య్సకార యువత రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలంటున్నావు. ఇప్పటిదాకా నీ చుట్టూ తిరిగే యువతను పిచ్చిపిచ్చి మాటలతో భ్రమల్లో నింపి చివరికి చంద్రబాబుకు తాకట్టు పెట్టిన నువ్వు ఇప్పుడేమో సుమతీశతకాలు పలుకుతావా..? ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడే నువ్వు యువతకు ఎందుకు సమాధానం చెప్పలేవు పవన్‌కళ్యాణ్‌..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.  వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. 

కులరాజకీయాలకు పాల్పడుతున్న బాబు, పవన్ః
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో దురదృష్టవశాత్తూ ఒక విద్యార్థి వ్యక్తిగతమైన వివాదం నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. దీన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఏమాదిరిగా రాజకీయం చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి. ప్రతిపక్షనేతగా చంద్రబాబు, నేనే సీఎంనంటూ తిరుగుతున్న ఫ్లవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కలిసి ఈ రాష్ట్రంలో అరాచకశక్తుల్లా మారారు.. ఒక వ్యక్తిగత అంశం నేపథ్యంలో జరిగిన బాలుడి హత్యాఘటనను కులానికి ముడిపెట్టి మాట్లాడుతున్న వైనంపై అందరికీ అవగాహన కావాల్సిన అవసరముంది. బీసీలంటూ.. ఇది ప్రభుత్వహత్యేనని చంద్రబాబు మాట్లాడటంలో అర్థముందా..? ఇలాంటి కులరాజకీయాలతో ప్రజల్లో పలుచనవడం తప్ప చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సాధించేదేమైనా ఉందా..? 

బాబు హయామంతా మహిళారోదనలేః
 ఏవేవో అంశాల్ని ప్రభుత్వంతో ముడిపెట్టి బురదజల్లే కార్యక్రమం చేయడం.. తద్వారా రాజకీయ లబ్ధిపొందడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. చంద్రబాబు హయాం లో మహిళల పట్ల జరిగిన దాష్టీకాల గురించి మనం గుర్తుచేసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై జరిగిన వ్యవస్థీకృత దాడులు అన్నీఇన్నీ కావు. ఒక మహిళా తహశీల్దార్‌ మీద స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే నేరుగా దాడిచేస్తే.. ఆయన్ను బాబు వెనుకేసుకు రావడం అందరం చూశాం కదా.. పైగా, ఆయన ఏమాత్రం సిగ్గూలజ్జ లేకుండా సదరు ఎమ్మెల్యే తీరును అప్పట్లో సమర్ధించారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పురిగొల్పిన విధానం.. అప్పటి ప్రభుత్వం నిందితుల్ని కాపాడిన వైనం సంచలనాత్మకమైతే, అప్పట్లో ప్రజలు బాబును ఛీకొట్టిన సంగతిని గుర్తుచేసుకోవాల్సి ఉంది. విజయవాడ కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరిట మహిళలపై జరిగిన దాడులు లెక్కకు మించి ఉన్నాయి. ఇక, అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత వివాదాల కారణాలతో ఎన్నో మారణకాండలు జరిగాయి. కానీ, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు హుందాగా రాజకీయాలు నడిపారు తప్ప ఈ బాబులాగా నీచంగా వ్యవహరించలేదు. 

కులాలన్నింటినీ అవమానించిన చరిత్ర బాబుది..ః
ఈరోజు చంద్రబాబుకు కొత్తగా బీసీలు గుర్తుకొచ్చారు. ఇతని రాజకీయ మేంటో.. కులాల పట్ల ఇతనికున్న వైఖరేంటో అతని మాటలే చెబుతాయి. ఏదో సమస్యపై మత్స్యకారులు బాబును కలిసినప్పుడు వాళ్లని తొక్కతీస్తా.. తోలువలుస్తానన్నాడు. నాయీబ్రాహ్మణ సోదరులను తోకలు కత్తిరిస్తానని బెదిరించాడు. ఇవన్నీ బీసీలు మరిచిపోయారనుకుంటున్నారా..? బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ బాబు రాసిన లేఖలు మా మెదళ్లలో నుంచి మాయం అయ్యాయనుకుంటున్నారా..? ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని నువ్వున్న మాటల్ని దళిత, గిరిజనసోదరులు ఇంకా మరిచిపోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నువ్వు ఏమేమి హామీలిచ్చావో.. నీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఏవిధంగా తుంగలో తొక్కావో ఎవరూ అంత త్వరగా మరువలేని పరిస్థితి ఉంది. బీసీ సబ్‌ప్లాన్‌ కోసం ఐదేళ్లలో రూ.20కోట్లు ఖర్చుపెడతానని చెప్పి ఆ నిధుల్ని మాయం చేసి మొండిచేయి చూపెట్టిన నువ్వు మళ్లీ బీసీల పక్షపాతిగా బిల్డప్‌ ఇస్తుంటే ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. 

నేరాలు, ఘోరాలు జరిగితే బాబుకు సరదాః
ఆంధ్రరాష్ట్రంలో నేరాలు గానీ ఘోరాలు ఎక్కడన్నా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు హాయాంలోనే. ఇప్పుడు ఏదన్నా సంఘటన జరిగితే తక్షణమే అక్కడ వాలిపోయి ఇష్టానుసారంగా రాజకీయాలు చేయడానికి.. ఈ రాష్ట్ర ప్రతిష్టతను మంట కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడాలేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నట్లు వాతావరణం క్రియేట్‌ చేయడానికి బాబు కుట్రలు పన్నుతున్న సంగతిని ప్రజలు కూడా గమనించారు. ఇలాంటి నీచరాజకీయాల పట్ల ప్రజల హర్షం వెలిబుచ్చరని.. ఇప్పటికే నీ మాటల్లోని నిగూఢార్థం ప్రజలకు తెలిసిపోయిందని బాబుకు అవగాహన కావాల్సిన అవసరముంది. 

జగన్‌గారు విజనరీ అయితే.. అసలైన పెద్ద సైకో బాబే..ః
బాబు ఇటీవల తన పర్యటనల్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ 23 స్థానాలు కాస్తా రెండు, మూడుకు పడిపోయేలా రాజకీయం చేసుకుంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిపై ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ రకరకాల పేర్లు పెడుతున్నాడు. అందుకని, ఈ సందర్భంలో చంద్రబాబును నేనొక విషయంపై ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో సైకో ఎవరు..?విజనరీ ఎవరు..?అని అడుగుతున్నాను. మా జగన్‌ గారేమో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడుతూ.. ఆ రంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి ‘నాడు– నేడు’ కార్యక్రమం పేరిట సుమారు రూ.58వేల కోట్లు ఖర్చుపెడితే.. ప్రభుత్వ విద్య అనేది ప్రభుత్వానిది కాదు. మాకు బాధ్యతేమీ కాదంటూ ఇది చై.నా (చైతన్య, నారాయణ) అని బాబు చెప్పాడు. దీన్నిబట్టి సైకోగా మాట్లాడింది బాబేకదా..  ఇక, వైద్యరంగానికొస్తే నాడు నేడు కార్యక్రమం కింద ఆస్పత్రుల ఆధునీకీకరణ, ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెఫ్ట్, 10వేల విలేజ్‌ హె ల్త్‌క్లినిక్స్‌ కావచ్చు, 50వేల కొత్త ఉద్యోగాలిచ్చిన జగన్‌ గారు విజనరీ కాదా..?అని గుర్తుచేస్తున్నాను. 

సచివాలయం, రైతుభరోసా వ్యవస్థలతో..ః
గడప వద్దకే పాలన అందించాలని ప్రతీ రెండు వేలమందికి ఒక సచివాలయం పెట్టి ప్రజల ముంగిటకు పరిపాలన తెచ్చిన జగన్‌ గారు విజనరీ అయితే.. జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్న చంద్రబాబు పెద్ద సైకో అని చెప్పాలి. రైతుల గురించి మాట్లాడితే.. 10వేల పైబడి రైతుభరోసా కేంద్రాల్ని తెచ్చి రైతు ఇంటి ముంగిటకు అన్ని సర్వీసుల్ని తెచ్చిన జగన్‌ గారు విజనరీ అయితే చంద్రబాబు మాత్రం రైతుల్ని దెబ్బతీసి సైకో అవతారమెత్తాడు. ఏకోశాన చూసినా అన్నిరంగాల్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పాలి. మరి, నీ హయాంలో కేవలం 34వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఉంటావు. అదే మా జగన్‌ గారు ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఇప్పుడు చెప్పు బాబూ.. నువ్వు విజనరీనా ..జగన్‌ గారు విజనరీనా..? ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ మాటలు మాట్లాడినటువంటి నువ్వు సైకోనా..? పారదర్శకంగా ఎలాంటి లంచాల్లేకుండా ఉద్యోగాలిచ్చిన జగన్‌గారు సైకోనా..? అంటే, ఖచ్చితంగా బాబే సైకో అని ఎవర్నడిగినా చెబుతారు. 
మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 32 లక్షలకు పైబడి ఇళ్ల స్థలాల్ని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే.. బాబు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ప్రతీ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం పెడితే ఇదే బాబు కోర్టులకెక్కి వాటికి అడ్డంపడే ప్రయత్నం చేశారు. ఇన్ని రకాలుగా ప్రజల అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు పెద్ద సైకో అని అందరికీ అర్థమైంది.  

పరపతిని దిగజార్చుకున్న బాబుకు ఇవే చివరి ఎన్నికలుః
చంద్రబాబు పూర్తిగా నిరాశతో ఆక్రోశంతో మాట్లాడటమే కాకుండా.. అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఆయన గతాన్ని మరిచిపోయి ఎన్ని కులాల్ని తూలనాడాడో.. ఎంతమందిని అవమానించాడో అనేది మరిచిపోయి జగన్‌గారిని సైకో సీఎం అంటుంటే, చంద్రబాబు పరపతి పెరగదు గానీ ఆయన ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుందని చెబుతున్నాను. బాబుకు ఇవే చివరి ఎన్నికలని నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఇటీవల ఎక్కడ్నో విన్నాను. చంద్రబాబు 2029 ఎన్నికల్లో కుప్పం సీటును ఎవరికో ఇస్తానని మాటిచ్చాడంట. తాను పోటీచేయనంటూ.. తన కొడుకు ఎందుకు పనికిరానోడంటూ బాబు అన్నట్లు వినిపించింది. బాబు దౌర్భాగ్యం ఎలా ఉందంటే.. ఇన్నాళ్ల తర్వాత కూడా మళ్లీ కుప్పం వెళ్లి ఈసారి నాకు ఓట్లేస్తారా..? లేదా.? అని అక్కడి ప్రజల్ని అనుమానంగా అర్థిస్తున్నాడు. 

బాబు, పవన్‌లు అయస్కాంత ధృవాలుః
ఇక, చంద్రబాబు, పవన్‌లకు మధ్య అయస్కాంతం ఉన్నట్టుంది. అయస్కాంతానికి ఉన్న ఉత్తర, దక్షిణ ధృవాల్లా వారిద్దరూ కలిసే ఉన్నట్లు కలుసుకోనట్లు ఉంటాయి. ఒకరి స్పిరిట్‌ను మరొకరి స్పిరిట్‌గా స్వీకరించుకుని మాట్లాడుతున్నారు. వారిద్దరూ ఒకటే స్క్రిప్టును వేర్వేరుగా ప్రెజెంట్‌ చేస్తూ.. మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈనాడు కార్యాలయంలో తయారైన స్క్రిప్టును వారిద్దరూ తిరుగుబోతుల మాదిరిగా చదివి ప్రచారం చేసుకుంటున్నారు. 

బోటెక్కితేనే మత్స్యకారుల సమస్యలు అర్థమౌతాయా పవన్‌..?ః
నిన్న కాకినాడలో ఏటిమొగ్గలో పవన్‌కళ్యాణ్‌ బోటెక్కి తిరిగాడు. ఏంటయ్యా అంటే, మత్స్యకారుల సమస్యల్ని తెలుసుకోవడానికి బోటెక్కానని చెబుతున్నాడు. అసలు, నీకు మత్స్యకారుల గురించి ఏం తెలుసు పవన్‌కళ్యాణ్‌..? ఒక్కసారి లైఫ్‌జాకెట్‌ వేసుకుని బోటెక్కితేనే సమస్యలు తెలిసిపోతాయా..? మరి, సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే ఈది, సముద్రంలోనే చేపలు పట్టేందుకు పనిచేసిన మాలోంటోళ్ల పరిస్థితేంటి..? మాకేమీ తెలియదనా..? అదేమంటే, మత్య్సకార యువత రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలంటున్నావు. ఇప్పటిదాకా నీ చుట్టూ తిరిగే యువతను పిచ్చిపిచ్చి మాటలతో భ్రమల్లో నింపి చివరికి చంద్రబాబుకు తాకట్టు పెట్టిన నువ్వు ఇప్పుడేమో సుమతీశతకాలు పలుకుతావా..? ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడే నువ్వు యువతకు ఎందుకు సమాధానం చెప్పలేవు పవన్‌కళ్యాణ్‌..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 

హార్బర్‌పై బాబును నిలదీయి పవన్‌..?ః 
ఈ రాష్ట్రంలో సుమారు 974 కిలోమీటర్లు తీరప్రాంతం ఉంటే, 65 ఏళ్ల ఆంధ్రరాష్ట్ర అవతరణ తర్వాత రెండే రెండు హార్బర్లు ఉంటే.. వాటిలో ఒకటి విశాఖపట్నం, రెండోది కాకినాడ ఉన్నాయి. అదే పక్క రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడు, కేరళ, గుజరాత్‌ ఇలా చూసుకుంటే ఎన్నెన్ని హార్బర్లు ఉన్నాయో తెలుస్తుంది. అంటే, రాష్ట్రాన్ని ఎవరెలా భ్రష్టు పట్టించారో అనేది తెలుస్తుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రంలో ఒక్క పోర్టు గానీ ఒక్క  హార్బర్‌ గానీ ఎందుకు  కట్టలేదేంటని నీ యజమానిని అడుగు పవన్‌కళ్యాణ్‌ అని హితవు చెబుతున్నాను.

వైఎస్‌ఆర్‌ గారి హయాంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులొచ్చాయిః
 పాపం, బాబు కోసం పిచ్చెక్కి వీధివీధి తిరుగుతూ ఉన్న పవన్‌కళ్యాణ్‌ మత్స్యకార సమస్యలపై, పోర్టులపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులొచ్చాయి. కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నిర్మాణం కూడా జరిగింది. మచిలీపట్నం పోర్టుకు కూడా వైఎస్‌ఆర్‌ గారే శంకుస్థాపన చేశారు. మరి, ఇదే చంద్రబాబు ఏ ఒక్క పోర్టు కైనా ఒక్క ఇటుకబెడ్డ వేశాడా..? అని ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పే దమ్ముందా..? అని అడుగుతున్నాను.

ఉప్పాడ, నెల్లూరు, నిజాంపట్నం హార్బర్‌లు తెలుసా పవన్‌కళ్యాణ్‌..?ః
 కాకినాడ, పిఠాపురం వెళ్లావు కదా.. కాస్త ముందుకెళ్లి ఉప్పాడ గ్రామాన్ని సందర్శించి.. అక్కడ సమస్యల్ని ఎందుకు అడగలేదు పవన్‌కళ్యాణ్‌..? ఉప్పాడ హార్బర్‌ కోసం చాన్నాళ్లుగా అక్కడ మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు కదా.. మరి, నీ యజమాని బాబు ఎందుకు పట్టించుకోలేదు..? ఈరోజు ఉప్పాడలో హార్బర్‌ నిర్మాణం జరుగుతుందని నువ్వెందుకు బుర్రకెక్కించుకోవు..?  నెల్లూరు జిల్లా గువ్వలదిన్నె దగ్గర హార్బర్‌ కడుతున్నాం చూడటానికి రా పవన్‌.. అదేవిధంగా నిజాంపట్నం హార్బర్‌ పనులు పూర్తికావచ్చాయి. దాని ఓపెనింగ్‌నకు నీకూ ఆహ్వానం పంపుతాం.. వస్తావా..? మచిలీపట్నంలో ఒకవైపు హార్బర్‌ నిర్మాణం జరగుతుంది.. మరోవైపు పోర్టు కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్లీ ఇవి రెండూ ఒకటే అనుకుంటావేమో.. కాదని తెలుసుకో వపన్‌.. ఇదంతా గ్రహించి మత్స్యకారులకు ఏం కావాలో.. వాణిజ్యానికి ఏం అవసరమోననే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోమని పవన్‌కళ్యాణ్‌కు హితవు చెబుతున్నాను. 

మత్స్యకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్‌గారుః
ఈ రాష్ట్రంలోని మత్స్యకారుల కష్టాలు, వారి బాధలు తెలిసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సుదీర్ఘమైన తీరప్రాంతమున్న ఈ రాష్ట్రానికి జవజీవాలిచ్చిన వారు జగన్‌ గారని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. హార్బర్‌ లేకపోవడంతో వలసలు పోతున్నారని అవగతం చేసుకున్న శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీరప్రాంతమున్న ప్రతీ జిల్లాలోనూ హార్బర్‌ కట్టివ్వాలని ఒక దీర్ఘకాల ప్రణాళికతో ప్రయత్నిస్తున్నారు. ఆయన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. రాష్ట్రంలో మొత్తం 4 పోర్టుల నిర్మాణం చేపడుతున్నాం. వాటిల్లో రామాయపట్నం పోర్టు, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టు పనులు మా హయాంలో జరుగుతున్నాయి. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నీ యజమాని చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పోర్టును ఎందుకు కట్టలేకపోయాడని నిలదీయవెందుకు..? అని పవన్‌ను ప్రశ్నిస్తున్నాను. బాబును నిలదీయలేని నీకు మా మత్స్యకారుల గురించి మాట్లాడే అర్హత లేదని మేం భావిస్తున్నాం. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్‌ కో రాజకీయంగా తెరమరుగు అవుతున్నారని తెలియజేస్తున్నాను. 

Back to Top