ఉద్దానం సమస్యపై ఈనాడు విష ప్రచారం 

మంత్రి సీదిరి అప్పలరాజు

ఉద్దానం బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు

పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణం

రూ.700 కోట్లతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం

తాడేపల్లి: ఉద్దానం ప్రాంత సమస్యలపై ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇవాళ ఈనాడులో వచ్చిన కథనం అసత్యమని ఆయన కొట్టి పారేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

 

 • ఉద్దానం సమస్యను గత ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదు
 • ఉద్దానం బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు
 • ఉద్దానం బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు
 • ఉద్దానం సమస్యపై ఈనాడు విష ప్రచారం చేస్తోంది
 •  గత ప్రభుత్వం ఉద్దానం సమస్యను పరిష్కరించేందుకు ఏం చేసింది?
 • మా నాయకుడు వైయస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించారు.
 • ఉద్దానం బాధితులకు ఇచ్చిన హమీని నెరవేర్చే దిశగా అడుగులు పడ్డాయి
 • మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్ల కాలంలో కిడ్నీ బాధితుల సంఖ్యను తగ్గించాం
 • సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకొచ్చాం. 
 • రీసెర్చ్‌ యూనివర్సిటీ ఇక్కడ నిర్మించాలని ఆ రోజే మా నాయకుడు సంకల్పించారు
 •  పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నిర్మిస్తున్నాం
 • ఇప్పటికే 78 శాతం మెడికల్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి పనులు పూర్తి చేశాం. 
 • డయాలసిస్‌ చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.10 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నాం.
 • స్టేజ్‌ –5 కిడ్నీ బాధితులకు కూడా రూ.5 వేల పెన్షన్‌ ఇస్తున్నాం. 
 • ప్రకాశం, కృష్ణా జిల్లా, నందిగామాలో స్మాల్‌ క్లస్టర్లు ఉన్నాయి. వీటిపై డబ్ల్యూహెచ్‌వో రీసెర్చ్‌ చేస్తోంది.
 • ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలన్న డబ్ల్యూహెచ్‌వో సూచనలను పరిగణలోకి తీసుకొని రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును వైయస్‌ జగన్‌ నిర్మిస్తున్నారు.
 •  
Back to Top