అసెంబ్లీ: తెలుగుదేశం పార్టీ సభ్యులు ఓ ప్లాన్, పద్ధతి ప్రకారం అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని, సభలో గందరగోళం సృష్టించాలనే చంద్రబాబు ఆదేశాల మేరకే కాగితాలు చించేస్తూ, సంప్రదాయాలను మంటగలిపే విధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యుల రచ్చ ప్లాన్ ప్రకారం కొనసాగుతోందన్నారు. మద్య నిషేధం గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. 2015లో ఆదాయం పెంచడం కోసం పర్‌క్యాపిటా లిక్కర్ కంజమ్షన్ ఎంత అని స్టడీ కోసం చంద్రబాబు తన టీమ్‌ను పంపించాడని గుర్తుచేశారు. జీఎస్టీ వచ్చిన తరువాత సంవత్సరం ఉండాల్సిన బార్ లైసెన్స్‌ను, 5 సంవత్సరాలకు పెంచాడని, 50 లక్షలకు పైబడి జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో బార్లకు రూ.25 లక్షల ఫీజు ఉంటే.. రూ.2 లక్షలకు తగ్గించి.. మిగిలిన డబ్బును నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టించుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు. హైవేల్లో లిక్కర్‌షాపులు ఉండకూడదని కేంద్రం ఆదేశిస్తే.. వాటిని తుంగలో తొక్కి.. హైవేలను అర్బన్ రోడ్డు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు అని రీడ్ చేయించి.. ఆయా ప్రదేశాల్లో 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి అనమతులు ఇచ్చిన నీచ చరిత్ర చంద్రబాబుది.. వారి మంత్రులతో బీర్ హెల్త్‌డ్రింక్ అని ప్రచారం చేయించిన దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుదని మంత్రి అప్పలరాజు ధ్వజమెత్తారు.