నెఫ్రాలజీ విభాగం ప్రారంభించి సేవలు అందించాలి

రిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు
 

శ్రీకాకుళం:   రిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగం ప్రారంభించి సేవలు అందించాల‌ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. రిమ్స్‌లో కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు ఆరుగురు స్పెషలిస్టుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయ‌న‌  తెలిపారు. కొత్తగా యూనిట్ల మంజూరుకు భవనం ఉందని, స్థలం, బెడ్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రిమ్స్‌లో మౌలిక సదుపాయాల కల్పన అంశంపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 7 నెలలుగా కోవిడ్ గురించే మాట్లాడుతున్నాం. జనరల్ మెడిసిన్‌లో 4 యూనిట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉంది. పోస్టుల అవసరం ఉంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.  టీడీపీ తిత్లీ దొంగలు మత్స్యకార భరోసాపై ఫిర్యాదు చేశార‌ని, ఈ పథకంలో అక్రమాలు జరిగాయన్నది అవాస్తవమ‌ని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదు. మత్స్యకార గ్రామాలకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాల‌ని సూచించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top