చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా టీడీపీ బతకదు

ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని బాబుకు తెలియదా..?

ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ

అనంతపురం: ప్రతిపక్షనేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో చేస్తున్న ధర్నా.. ఓ డ్రామా అని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని చంద్రబాబుకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో చంద్రబాబు వైఖరిని మంత్రి తీవ్రంగా ఖండించారు. మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి ఎన్నికల కోడ్‌ గురించి తెలియదా అని నిలదీశారు. టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదని బాబుకు భయపడుతున్నారన్నారు. ఏపీలో టీడీపీ భూస్థాపితం అయిందని, చంద్రబాబు ఎన్ని పాట్లు పడినా టీడీపీ బతకదని స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top