ఆ ఘనత వైయస్‌ జగన్‌దే

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ
 

అమరావతి : దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు.   గ్రామ వాలెంటరీలుగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవస్థను  భ్రష్టు పట్టించారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన కొనసాగిందని మండిపడ్డారు. 
 

Back to Top