చంద్రబాబుది నోరా? మూసీ నదా?

రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబే

40రోజుల్లో బాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్

14ఏళ్ళు సీఎంగా ఉండి ఇచ్చిన ఉద్యోగాలెన్ని బాబూ..?

ఉత్తరాంధ్ర ద్రోహివి నువ్వు కాదా బాబూ..?

ఉద్దానంలో వేలమంది చావులకు బాబు సమాధానం చెప్పాలి

మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

ఆధునిక అంబేద్కర్ వైయ‌స్ జ‌గ‌న్‌

బాబు కులానికి ఇచ్చినన్ని సీట్లు కూడా పవన్ కు ఇవ్వలేదు

మంగ‌ళ‌గిరి: చంద్రబాబుది నోరా.. మూసీనదా? అంటూ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మండిపడ్డారు.  సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని అన్నారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.  చంద్రబాబు శ్రీకాకుళంలో రా.. కదలిరా సభ పెట్టి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటున్నాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశాడు?. సీఎం జగన్‌ ఉత్తరాంధకు పరిపాలన రాజధాని ఇస్తే దాన్ని కోర్టుకు వెళ్లే అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. ఉద్దానాన్ని చంద్రబాబు స్మశానంగా మార్చాడని.. ఉద్దానంలో చావులకు ఆయనే కారణమని ధ్వజమెత్తారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

నేను ఫలానా మేలు చేశానని చెప్పుకోలేని దౌర్భాగ్యపు పాలన చంద్రబాబుదిః

 • చంద్రబాబు నిన్న శ్రీకాకుళంలో రా..కదలిరా.. అంటూ దాదాపు గంటన్నర మాట్లాడారు. ఆ గంటన్నర సమయంలో ఫలానా అభివృద్ది కార్యక్రమం మీ జిల్లాకు, ఈ రాష్ట్రానికి చేశాను, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండని అడగలేని దౌర్భగ్యమైన పరిపాలన గతంలో చంద్రబాబు చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశానని చెప్పుకోలేని పరిస్థితిలో జగన్ గారిపై బురదజల్లడం, తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రను పూర్తిగా అభివృద్దిలో వెనక్కి నెట్టేశారు.

మీ కారణంగా అభివృద్దిలో వెనుకబడ్డామే తప్ప తెలివితేటల్లోనూ, చైతన్యంలోనూ వెనుకబడలేదు అనే విషయం చంద్రబాబు గ్రహించాలి. జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తావా?

 • చంద్రబాబు దృష్టిలో సుపరిపాలన అంటే జన్మభూమి కమిటీలేనా? అప్రజాస్వామ్యకమైన,రాజ్యాంగవిరుద్ధమైన జన్మభూమి కమిటీల వల్ల సుపరిపాలన సాధ్యమా? జన్మభూమి కమిటీలు సుపరిపాలన చేస్తాయా? 2019లో చంద్రబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలు, మీ పార్టీ పాడె మోయడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలు అనే విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోపిడీ చేసిన మీరు సుపరిపాలన గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది.

మా హయాంలో పేదరికం తగ్గిందిః

 • సుపరిపాలన అంటే జగన్ గారు తీసుకొచ్చిన గ్రామ,వార్డు సచివాలయాలు వాటికి అనుసంధానంగా వచ్చిన వాలంటీర్ వ్యవస్థ. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా శాచురేషన్ మోడ్ లో మేము ఇస్తున్న పరిపాలనే సుపరిపాలన.ఈ సుపరిపాలన వలనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గింది. గతంలో 11.5 శాతం పేదరికం ఉంటే ఈ ఐదేళ్ళలో 5 శాతం కంటే దిగువకు వచ్చింది. ఈ స్థాయిలో పేదరికాన్ని తగ్గించడం అనేది దేశంలోనే ఎవరికీ సాధ్యపడలేదు. పేదరికంలో దేశ సగటు 11 శాతం ఉంది. అసలు మీ టీడీపీ ఐదేళ్ళ కాలంలో పేదరికం ఎలా ఉందో చంద్రబాబు చెప్పాలి. 2018లో చంద్రబాబు రిలీజ్ చేసిన పెర్ఫామెన్స్ ఎప్రైజల్ ఇండెక్స్ బుక్ లోనే అన్ని ఇండెక్స్ ల్లో కూడా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉంది. 11, 12స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం పోటీపడ్డాయి, అటువంటి మీరు ఇప్పుడు వచ్చి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది చేస్తాను, జిల్లా వాసుల్ని, మత్య్సకారుల్ని అభివృద్ది చేస్తానని డ్రామాలు ఆడుతున్నారు.

రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబే:

 • చెత్తమీద పన్ను అని మాట్లాడున్న చంద్రబాబును ముందు తీసేయాలి..ఎందుకంటే, 2014-19 కాలంలో ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు.. స్వచ్ఛ భారత్ మీద సెస్ వేయండి, స్వచ్ఛ భారత్ సెస్ గ్రామాల్లో వేయండి, చెత్త మీద పన్ను విధించండని ప్రధానికి లెటర్ రాసింది చంద్రబాబు కాదా? చెత్త మీద పన్ను విధించమని ప్రధానికి లెటర్ రాసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈరోజు వచ్చి జగన్ గారి మీద అభాండాలు వేస్తున్నాడు. రాష్ట్రంలో అతిపెద్ద చెత్త అయిన చంద్రబాబును తీసేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు.

చంద్రబాబుది నోరా? మూసీ నదా?:

 • ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున రాబోయే ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. అయ్యా! చంద్రబాబు నీకో నమస్కారం అసలు నీది నోరా? మూసీ నదా? 65ఏళ్ళ ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత సుదీర్ఘకాలం దాదాపు 14ఏళ్లు సీఎంగా పనిచేసి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావు. 2019లో జగన్ గారు సీఎం అయ్యాక కొత్తగా 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి దాదాపు 6.5లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.

బాబు ఇచ్చిన ఉద్యోగాలు 34 వేలుః

 • ఇప్పుడు కొత్తగా సంవత్సరానికి 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తావా?, మరి 14ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేదు.? గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు.. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావు? ఎంతమందికి ఉద్యోగం ఇచ్చావు? 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34వేలు. ఇది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు మాటలు ఎందుకు?. నీ కొడుకు మాట్లాడుతూ.. కోటి 70లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు.. తండ్రికొడుకులు ఇద్దరూ ఒక్కటేనా? అసలు రాష్ట్రంలో అంతమంది విద్యార్థులు ఉన్నారా? కోటి70లక్షలమంది విద్యార్ధులే లేరు కానీ, రాష్ట్రంలో అంతమందికి ఉద్యోగాలు ఇచ్చారా? అసలు రాష్ట్రంలో కుటుంబాలే కోటి62లక్షలు ఉంటే, కోటి 70లక్షల ఉద్యోగాలు ఇచ్చావా? తెలంగాణ, ఏపీ కలిపినా కోటి 70లక్షల విద్యార్థులు లేరు. నీ కొడుక్కి, నీకూ బుర్ర పనిచేయట్లేదు, నీ బుద్ధే నీ కొడుక్కి వచ్చింది, తండ్రికొడుకులు ఇద్దరూ ఒక్కటే బాపతా.

ఆధునిక అంబేద్కర్ జగన్:

 • జగన్ గారు రాష్ట్రంలోని పేదలకు ప్రతినిధి.. అయితే చంద్రబాబు పెత్తందారులకు మాత్రమే ప్రతినిధి.
 • మొన్న 94 అసెంబ్లీ సీట్లకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఆయన కులానికే 22 సీట్లు ఇచ్చారు. తన కులానికి ఇచ్చినన్ని సీట్లను కూడా పొత్తులో ఉన్న జనసేనకు ఇవ్వలేదు. అటువంటి చంద్రబాబు పేదలకు ప్రతినిధి ఎలా అవుతాడు.? జగన్ గారు కచ్ఛితంగా పేదలకు ప్రతినిధే. అంటరానితనాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆధునిక అంబేద్కర్ జగన్ గారు. చంద్రబాబు నిర్వీర్యం చేసిన ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ నాడు-నేడు ద్వారా ఒక రూపునిస్తూ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి, కార్పొరేషన్ పాఠశాలలకు దీటుగా వాటిని తయారుచేసి పేదపిల్లల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచిన ముఖ్యమంత్రి జగన్ గారు.
 • చంద్రబాబుకు అసలు గుర్తేరాని.. ప్రభుత్వ వైద్యశాలలన్నింటిలోనూ నాడు-నేడు ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని తిరిగి సంపూర్ణంగా పేదలకు అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్ గారు.
 • జన్మభూమి కమిటీల పేరుతో పేదల ఆత్మాభిమానాన్ని టీడీపీ దగ్గర తాకట్టుపెట్టేటట్టు చంద్రబాబు చేస్తే.. ప్రభుత్వాన్ని పేదల ఇంటి దగ్గరకు పంపించి తలుపుతట్టి చిరునవ్వుతో సంక్షేమ ఫలాల్ని చేతికి అందిస్తున్న సీఎం జగన్ గారు. ఎవరు పేదలకు ప్రతినిధి? ఎవరు పెత్తందారులకు ప్రతినిధి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.
 • చంద్రబాబుకు నోరుందని, మీడియా ఉందని, ఏది మాట్లాడితే అది పబ్లిష్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఛానల్స్ ఉన్నాయని అబద్దాలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటున్నారేమో.. ఎల్లో మీడియా కంటే బలంగా యువకులు, సోషల్ మీడియా పనిచేస్తుంది. వాస్తవాలను ప్రజలకు చెప్తున్నారు.

ఉత్తరాంధ్ర ద్రోహివి నువ్వు కాదా బాబూ..?

 • నీ 14ఏళ్ళ పరిపాలన కాలంలో ఉత్తరాంధ్రకు ఏం చేశావో సూటిగా చెప్పగలవా చంద్రబాబు..?. ఎవరు చర్చకు వచ్చినా సిద్ధంగా ఉన్నాను, మీరు పెట్టే మీటింగ్ దగ్గరకు వచ్చి చర్చించమన్నా సిద్ధంగా ఉన్నాను. మా హయాంలో ఏం చేశామో చెప్పడానికి రెడీగా ఉన్నాము. మా హయాంలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ హాస్పటల్ కావొచ్చు, ఉద్దానం ప్రాంత ప్రజల కోసం రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు కావొచ్చు, జోరుగా జరుగుతున్న ఆఫ్ షోర్ పనులు కావొచ్చు, ఇనుమండ్ల రిజర్వాయర్ ను పూర్తి సామర్థ్యంతో తీసుకురావడానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, పూర్తి కావొస్తున్న వంశధార స్టేజ్-2 పనులు, పూర్తికావొస్తున్న వంశధార-నాగావళి అనుసంధానం, భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం హార్బర్ కావొచ్చు, ఆధునీకరించబడుతున్న వైజాగ్ హార్బర్, పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ , అనకాలపల్లి మెడికల్ కాలేజీ ఇలా ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం మేం ఏం చేశామో, చేస్తున్నామో చెప్పడానికి రెడిగా ఉన్నాం.. అసలు మీరు ఏం చేశారో చెప్పండి? అరగంట టైం తీసుకున్నా సరే మీరు ఉత్రరాంధ్రకు ఏం చేశారో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేరు.

బాబుకు సిగ్గుందా?

 • ఉద్దానం సుజల స్రవంతి కోసం రూ.2వేల కోట్లు ఇచ్చాడంటా.. అసలు చంద్రబాబుకు సిగ్గుందా? ఎన్నికలకు నెలరోజుల ముందు జీవో ఇస్తే రూ.2వేల కోట్లు ఖర్చుపెట్టేస్తారా? అసలు సిగ్గులజ్జ ఉందా? అసలు సుజల స్రవంతి ప్రాజెక్ట్ కోసం ఒక్క ఇంచ్ భూమి అయినా సేకరించారా? మనిషివేనా? నోరుందని ఏది పడితే అది మాట్లాడతావా? ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కావొచ్చింది. జగన్ గారి హయాంలోనే గోదావరి నీరు వంశధార వరకు వచ్చి తీరుతుంది, రాసిపెట్టుకోండి. వాట్ నాట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరాంధ్ర..
 • ఈ రోజు జగన్ గారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేస్తే, వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజల ఆస్తులకు విలువ పెంచాలని నిర్ణయం తీసుకుంటే, కోర్టులకు వెళ్ళి అడ్డుకుని తిరిగి మరల దూషిస్తావా? సిగ్గులజ్జ ఉందా చంద్రబాబు? ఉత్తరాంధ్ర మీద ఇదేనా ప్రేమ? 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క పని కూడా చేయలేదు. చంద్రబాబు కారణంగా ఉత్తరాంధ్ర వలసల బాట పట్టింది. చంద్రబాబు కారణంగా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది.
 • కనీసం హర్బర్ కు, పోర్టు కు తేడా తెలియని దౌర్భగ్య పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. అటువంటి నువ్వు మూలపేట పోర్టను, భావనపాడు కింద మారుస్తావా? ఏంటి మార్చేది.. భావనపాడు ఎక్కడుందో, మూలపేట ఎక్కడుందో నీకు తెలుసా? భావనపాడులో ఏముందో, మూలపేటలో ఏం కడుతున్నామో నీకు తెలుసా? అసలు నీకు అవగాహన ఉందా? నువ్వు కొత్తగా వచ్చి మా మత్య్సకారులను ఉద్దరిస్తావా? మేం బాగున్నాము.. నువ్వు ఉద్ధరించింది చాలు మాకు.. నువ్వు సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో కేవలం విశాఖపట్నం, కాకినాడ హర్బర్ లు ఉన్నాయి.. జగన్ గారు మత్స్యకార బాంధవుడు, మత్స్యకార స్నేహితుడు, మత్స్యకార శ్రేయోభిలాషి.. ఆయన వల్ల 10 ఫిషింగ్ హార్బర్ లు మంజూరు చేయించుకోగలిగాం. నేనే దానికి మంత్రి.. నేనే దానికి సాక్ష్యం. మా జిల్లాలో బుడగట్లపాలెం దగ్గర హార్బర్ కడుతున్నాం వెళ్లి చెక్ చేసుకో, నువ్వులురేవు మంచినీళ్ళపేట దగ్గర ఎఫ్ఎల్ సీని కూడా హర్బర్ గా మార్చబోతున్నాం.. ప్రతి జిల్లాలో కూడా హార్బర్ ఇచ్చిన ఘనత మాది.
 • మీ హయాంలో ఒక్క హార్బర్ కు గానీ, ఒక్క పోర్టుకు గానీ శంకుస్థాపన చేశావా? ఒక్క హార్బర్ ను కానీ, ఒక్క పోర్టును కానీ ప్రారంభించావా? నీకు దమ్ముంటే చెప్పు. మూలపేట పోర్టు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టు, రామయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు జగన్ గారి ఘనతలు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఘనతలు. మిగతా పోర్టులు పాతవి..నీ హయాంలో కట్టినవి కాదు.. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంటే సన్ రైజ్ స్టేట్ అని పేరు పెట్టావు, గొప్పలు చెప్పావు, సుదీర్ఘమైన తీరప్రాంతానికి ఏం చేశావో చెప్పు. 1995 నుంచి ఏం చేశావో చెప్పు..

మత్య్సకారులు చంద్రబాబును నమ్మరు:

 • మళ్ళీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తావా? జగన్ గారు మత్స్యకారులకు ఎన్ని పదవులు ఇచ్చారో తెలుసా? మత్స్యకార నాయకురాలు కర్రి పద్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం, వడ్డీలు వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం, వన్యకుల క్షత్రియ వర్గానికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యం గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం, రేపు నీ మీద కుప్పంలో గెలవబోతున్న మత్య్సకారుడు కేజే భరత్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం, మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం, నేను మంత్రిగా ఉన్నాను, నీ పార్టీలో మత్స్యకారులకు నువ్వు ఇచ్చిన స్థానం ఏంటి.? నీకు బాకాలు ఊదడానికా? అసలు నిన్నెందుకు మత్స్యకారులు ఓడించారో తెలుసా బాబూ.. మా తోలు తీస్తామని, తోకలు కత్తిరిస్తామని, మా టెంట్ లు పీకేస్తామని బెదిరించిన నిన్ను ఏ జన్మలో కూడా ఏ మత్స్యకారుడూ నమ్మడు.

ఉద్దానంలో వేలమంది చావులకు బాబు సమాధానం చెప్పాలి:

 • ఉద్దానంలో వందల, వేల మంది ప్రాణాలు పోతుంటే.. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళకు ప్రైవేటు హస్పటల్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చావు..తప్పితే ఉద్దానం సమస్యకు పరిష్కారం ఎందుకు చూపలేకపోయావు.. అధికారంలో ఉన్నప్పుడు నీవు వేసిన వేషాలన్నీ మాకు తెలుసు. నువ్వు చేసిన ప్రతి మోసం అందరికి తెలుసు. అటువంటి నువ్వు ఉద్దానం కిడ్నీ హాస్పటల్ గురించి మాట్లాడుతున్నావు, ఉద్దానం ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. నీ కారణంగా ఉద్దానంలో చనిపోయిన వేలమంది మరణాలకు సమాధానం చెప్పి తీరాలి. నీ కారణంగా మా ఉద్దానం వల్లకాడు అయిపోయింది, తుఫాన్ లు వచ్చి మేం నష్టపోతే అటువంటి నష్టపోయిన ప్రాంతం మీద రాజకీయం చేశావు, జగన్ గారు తిత్లీ పరిహారం పెంచి ఇవ్వడమే కాకుండా, కొన్ని లక్షల జీడిమొక్కలు, కొబ్బరి మొక్కలు పంపిణీ చేసి ఉద్దానాన్ని పునర్నిర్మించారు.ప్రైవేట్ అసోసియేషన్ వారికి ల్యాండ్ ఇచ్చి హాస్పటల్ కట్టుకోమని చెప్పి హాస్పటల్ కట్టానని చెబుతున్నావు సిగ్గుందా? రూ.4కోట్లు ఇచ్చి ఎన్టీఆర్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి మినరల్ వాటర్ ప్రాజెక్టు ఇచ్చావు.. ఇదేనా నీ చిత్తశుద్ధి? జిల్లాలో ఎమ్మెల్యేలు అవినీతి అని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఇసుక అంటే అచ్చెన్నాయుడు, దోపిడి అంటే అచ్చెన్నాయుడు, దౌర్జన్యం అంటే అచ్చెన్నాయుడు, రవికుమార్ అందుకే అందర్ని ఇంటికి పంపించారు..

40రోజుల్లో చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్:

 • 14ఏళ్ళలో ఫలానా మంచి చేశాను నాకు అవకాశం ఇవ్వండని చెప్పుకోలేని దౌర్బగ్య పరిస్థితిలో రా..కదలిరా.. అంటూ మాట్లాడుతున్నావు. మరో 40రోజుల్లో నిన్ను రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా ఇంటికి పంపిస్తారు. ఇదే నీ చివరి ఎన్నికలు. నీకు చేతనైతే, సిగ్గులజ్జ ఉంటే అబద్దాలు మాట్లాడకు. నీ కొడుకు చెప్పిన కోటి70లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చూపించు.. యువకులకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నావు.. నీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ గారికి ప్రజల్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ స్పష్టంగా తెలుస్తున్నాయి.. కేవలం 40రోజుల్లో చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడుతుంది.
Back to Top