తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే టీడీపీ గన్నవరం డ్రామాకు తెర లేపిందని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గన్నవరం గొడవ ప్రపంచ స్థాయి విషయం అన్నట్లుగా ఎల్లో మీడియా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిని అరెస్టు చేస్తే.. రాధాకృష్ణ, రామోజీలకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు ఏమో..అన్నారు. మేం నిజంగా కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా..? అని ప్రశ్నించారు. మేం చేసిన సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళ్లకూడదని చంద్రబాబు విజయవాడలో గొడవలు సృష్టించాడు, పట్టాభిని ఎవరైనా కిడ్నాప్ చేయగలరా..? ఆయన్నెవరైన ఎత్తుకుని వెళ్లగలరా..?
చంద్రబాబు మీ అల్లరి మూకలను అదుపుచేసుకోండి అని సూచించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు..
*రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్ః*
- సీఎం వైయస్ జగన్ గారి నేతృత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఒక సోషల్ ఇంజినీరింగ్
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్‌గారు చేస్తున్న సమన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది
- నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి మొత్తం 44 మంది ఎమ్మెల్సీల్లో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు
- అది 68 శాతం కంటే అధికం...గతంలో ఏ నాయకుడికీ ఇది సాధ్యం కాలేదు
- వడ్డెరలను అణచి వేస్తున్నారని పాదయాత్రలో చినబాబు మాట్లాడుతున్నాడు
- మిస్టర్ మాలోకం..రాసుకో...వడ్డెర సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్ గారిది
- బీసీలకు మీ నాన్న ఎంత న్యాయం చేశాడో ముందు నువ్వు ప్రశ్నించు లోకేశ్
- తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్సీల ఎంపికలో... కేవలం 37 శాతం మాత్రమే అణగారినవర్గాల వారికి బాబు అవకాశం ఇచ్చాడు
- దాన్ని మర్చిపోయి బీసీలకు వన్నెతెచ్చిన పార్టీ టీడీపీ అంటూ బాకాలు ఊదుకుంటున్నారు
*ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకి బీసీలపై కసి తగ్గలేదు:*
- తోకలు కత్తిరిస్తాం, తాటతీస్తాం... అంటూ నాయీ బ్రాహ్మణలను, మత్స్యకారులను అధికారంలో ఉండగా బెదిరించిన వ్యక్తి చంద్రబాబు
- బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖలు రాసింది కూడా ఈ చంద్రబాబే..
- బీసీలుగా పుట్టిన ప్రతి ఒక్కరూ... చంద్రబాబు బీసీలను అవమానించిన తీరును ఎన్నటికీ మర్చిపోరు
- బీసీలను అవమానించినందుకు ఎట్రాసిటీ కేసులు ఏమైనా ఉంటే చంద్రబాబును ఉరితీసే పరిస్థితి కూడా ఉండొచ్చు..
- బీసీలను తీవ్రంగా అవమానించిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలి..?
- అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబుకు కడుపు మంట తగ్గలేదు
- తన పగ ఇంకా చల్లార్లేదన్నట్లు ఆ కసి, కోపం ప్రతి సందర్భంలోనూ బీసీలపై చూపిస్తున్నాడు
- పేదవాళ్లకి ఇంగ్లీషు మీడియం చదువులు వద్దంటూ కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు
- బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఇస్తాను అని జగన్మోహన్‌రెడ్డి గారు అంటే దానిపై చంద్రబాబు కోర్టుకు వెళ్లింది నిజం కాదా..?
- మళ్లీ తానే 34 శాతం ఇస్తానని ఇప్పుడంటున్నాడు
- సిగ్గు లేని రాజకీయాలకు కేరాఫ్‌అడ్రస్ ఈ దగుల్బాజీ చంద్రబాబు
- "పేదలకు డీబీటీ ఎలా ఇస్తారు... ? ఇస్తే, ఏపీ అప్పుల పాలు అవుతుందని, శ్రీలంక అవుతుందని" విద్వేషం చిమ్మింది చంద్రబాబే..
- కేంద్రానికి, అతర్జాతీయ సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌కి డబ్బులు ఇవ్వొద్దు, పెట్టుబడులు పెట్టొద్దని ఈయన లేఖలు రాశాడు
*పదవులంటే... అమ్ముకోవడమే బాబుకు తెలుసు:*
- రాబోయే ఎన్నికలు...పేదవారికి, పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు
- రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును నామరూపాల్లేకుండా చేయాలి
- ఇలాంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం
- చంద్రబాబు హయాంలో ఎవడు సూట్ కేసులు ఇస్తే.. వారికే ఎమ్మెల్సీ సీట్లు, రాజ్యసభ సీట్లు.
- ఎప్పుడైనా చంద్రబాబు ఒక బీసీని రాజ్యసభకు పంపాడా..?
- పదవులంటే ఎప్పుడూ అమ్ముకోవడమే చంద్రబాబుకు తెలుసు.
- మీరిచ్చిన ఆదరణ పనిముట్ల వల్ల, జీవితంలో స్థిరపడిన ఒక్క బీసీ కుటుంబాన్ని చూపించాలని నేను టీడీపీ వారిని సవాల్ చేస్తున్నా
- ఎన్నడూ వినని కులాల వారిని కూడా అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్
- ఏకంగా నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి గారికి, చంద్రబాబుకి పోలికే లేదు
బచ్చా లోకేశ్...
- జగన్ గారిని లోకేశ్ నోటికొచ్చినట్లు దూషిస్తున్నాడు.. పిల్ల బచ్చాగాడివి... దొడ్డిదారిన మంత్రి అయిన నీ స్థాయి ఏంటి..?
- మీరు తిడుతూ ఉంటే మేం చూస్తూ కూర్చోవాలా...?
- ఒక్కొక్కడికి రాజకీయంగా తాట తీసే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి
- చంద్రబాబూ నీ నటన ఇక చాలు.. ఈ రాష్ట్రానికి నీ దరిద్రం కూడా ఇక చాలు