సంగం డెయిరీ ప్రభుత్వం​ ఆస్తి.. అది ప్రజల సొత్తు

మంత్రి సీదిరి అప్పలరాజు

గుంటూరు: చంద్రబాబునాయుడు ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ప్రభుత్వం​ ఆస్తి.. అది ప్రజల సొత్తు అని చెప్పారు.

ఏ రోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు పిచ్చెక్కిందని అన్నారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. గతంలో చేసిన పాపాలతో ఇదే కర్మ రా బాబు అని చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. 

Back to Top