అందుకే లోకేష్‌ను ముద్ద పప్పు అనేది..

లోకేష్ ట్వీట్ల‌పై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఆగ్ర‌హం

అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తే త‌గిన బుద్ధిచెబుతామ‌ని హెచ్చ‌రిక‌

శ్రీ‌కాకుళం: పలాస నియోజకవర్గంలో ఏదో జరిగిపోయిందని ముద్ద పప్పు లోకేష్ ట్వీట్లు పెడుతూ ప్ర‌భుత్వంపై విమర్శలు చేస్తున్నాడ‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు. కుటుంబ కలహాలను రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై నెట్టేయడం తండ్రి నుంచి లోకేష్‌కు వార‌స‌త్వంగా అబ్బినట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు 420 అయితే కొడుకు లోకేష్ ఆయనకు మించి త‌యార‌డ‌య్యాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. మందస మండలంలోని హరిపురంలో జరిగిన వివాదానికి సంబంధించిన‌ అసలు విషయం లోకేష్‌కు తెలుసా అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అంటే చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు భయం అనే విషయం అర్థ‌మ‌వుతోంద‌ని, అందుకే అసత్య ప్రచారాల తోపాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని దుయ్య‌బ‌ట్టారు. 

హరిపురంలో ఒక కుటుంబానికి సంబంధించిన భూముల వివాదం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంద‌ని, వారి ఆస్తుల కోసం కోర్టులను కూడా ఆశ్రయించారన్నారు. సోమవారం జరిగిన ఘటనకు వైయ‌స్ఆర్ సీపీకి సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆ వివాదంలో తెలుగుదేశం పార్టీ వారే అధికంగా ఉన్నారనే విష‌యం లోకేష్‌కు తెలుసా అని నిల‌దీశారు. నిజాలు తెలుసుకోకుండా మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మగతనం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయాల‌ని లోకేష్‌కు సూచించారు. అసత్య ఆరోపణ‌లు చేస్తూ ట్వీట్లు చేస్తే సరైన బుద్ది చెబుతామ‌ని హెచ్చ‌రించారు. .
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top