ప్రజల్లో చంద్రబాబు విశ్వాసం కోల్పోయారు

మంత్రి సీదిరి అప్పలరాజు

చంద్రబాబు, వైయస్‌ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

అమరావతి: ప్రజల్లో చంద్రబాబు విశ్వాసం కోల్పోయారని, ఆయన్ను ఎవరూ నమ్మడం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. సభలో చంద్రబాబు మాటలు బాధాకరం. బాబాయి గొడ్డలి అనే విషయంపై నినాదాలు చేశారు. హత్యలు గురించి మాట్లాడాల్సి వస్తే..వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి గురించి మాట్లాడాలని అంబటి రాంబాబు అన్నారు. అందరం కూడా వింటున్నాం..వేరే ఉద్దేశ్యాలు లేవు. వెంటనే చంద్రబాబు లేచి తల్లి గురించి, చెల్లి గురించి, భారతి గురించి మాట్లాడాలన్నారు. ఆ సమయంలో గట్టిగా గొడవ పెడితే చిన్న పిల్లాడు అంటారని ఆ క్షణంలో మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను. గతంలో వైయస్‌ జగన్‌ ఇలాగే సభలో చాలెంజ్‌ చేసి ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రిగా మళ్లి సభకు వచ్చారు కదా? నేను కూడా ఇలాంటి చాలెంజ్‌ చేస్తాననే ఆలోచనతో చంద్రబాబు అన్నట్లుగా ఉంది. వైయస్‌ జగన్‌ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన సందర్భం వేరు. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం లేకపోవడంతో ఆ రోజు వైయస్‌ జగన్‌ సభ నుంచి బయటకు వెళ్లారు. ఇదే అసెంబ్లీలో గతంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కిన సందర్భం మనందరం చూశాం. 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని, పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఈ రకమైన రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనలకు ఇదే అసెంబ్లీ చరిత్రకు సాక్షంగా నిలిచింది. ఇలాంటి దేవాలయంలో స్పీకర్‌ చైర్‌లో ఉన్న అప్పటి స్పీకర్‌ ఖండించలేదు. పైగా సమర్ధించారు. అసెంబ్లీ ప్రజాసమస్యలకు నిలయం కాదు..ప్రస్తావనకు రావడం లేదని, ప్రజల సమస్యలను ప్రజల మధ్య తీరుస్తానని వైయస్‌ జగన్‌ ఆ రోజు ఇక్కడి నుంచి చాలెంజ్‌ చేసి బయటకు వెళ్లారు. ఈ రోజు చంద్రబాబు తొడ గొట్టి బయటకు వెళ్లారు. దానికి, దీనికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది. రేపు పేపర్లో చంద్రబాబు చాలెంజ్‌ అని, చంద్రబాబు శపథం అని బ్యానర్లు పెట్టుకోవడానికే పనికి వస్తాయి. బ్రహ్మండం బద్దలైనట్లు కొన్ని పత్రికల్లో వస్తాయి..రేపు మనం చూడవచ్చు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కుదేలు కావడంతో దానికి జవసత్వాలు పోసేందుకు చంద్రబాబు ఇలాంటి శపథాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉండదు. చంద్రబాబు మాట్లాడిన మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top