లక్ష పశువులను కొనుగోలు చేస్తాం

పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

అమరావతి: పాడి పశువులు, గొర్రెల కొనుగోలుకు రూ.5,386 కోట్లు కేటాయించామని పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేస్తామని, మహిళలు స్వయం ఉపాధి పొందేలా, ఆర్థికంగా వారి కళ్లపై వారు నిలబడాలనే సద్దుదేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ముర్రజాతి, మేలు రకమైన లక్ష పశువులను కొనుగోలు చేస్తామన్నారు. డిసెంబర్‌ 1 నుంచి ఫిబ్రవరి వరకు కొనుగోలు.. బ్యాంక్‌ లింక్‌ చేపడుతామని చెప్పారు. 

రెండున్నర లక్షల మంది లబ్ధిదారులు గొర్రెలు, మేకల కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి అప్పలరాజు వివరించారు. ఒక్కో యూనిట్‌కు రూ.75 వేలు, అదనంగా కాపరులకు కిట్‌ ఇస్తామన్నారు. ఈ నెల 26న ఏపీ అమూల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. 96,888 కేంద్రాల్లో మహిళల ద్వారా పాల సేకరణ చేపడతామని, పాలపై లీటర్‌కు అదనంగా రూ.4 కంటే ఎక్కువ దక్కేలా చేస్తామని తెలిపారు. ఏపీ అమూల్‌పై కొన్ని పత్రికలు బురదజల్లుతున్నాయని మండిపడ్డారు.  
 

Back to Top