ఆ ప్రయోజనం కల్పించేందుకే అమూల్‌తో ఒప్పందం

25న ఏపీ అమూల్‌ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు

రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రకాశం: పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించేందుకే అమూల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 25న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏపీ అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారని చెప్పారు. మొదటి విడతలో ప్రకాశం, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ప్రారంభిస్తారన్నారు. రూ.1,330 కోట్లతో ఆర్‌బీకేల వద్ద బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రూ.500 కోట్లతో పాల సేకరణ కేందరాలను నిర్మిస్తామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top