చంద్రబాబు అబద్ధాల కోరు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ
 

అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీ భయపడుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని, టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. అనంతపురంలో మంత్రి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఓ వైపు హింసా రాజకీయాలకు పాల్పడుతూనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లుతుందని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ఆగడాలు మితిమీరిపోతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తూనే తమపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకుంటే మంచిదని, లేకుండా ప్రజలు క్షమించరన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు.

Back to Top