బాలకృష్ణ రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారు

మంత్రి శంకర్ నారాయణ
 

అనంతపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజీనామా చేయాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే కోరుకుంటున్నార‌ని మంత్రి శంక‌ర్ నారాయ‌ణ తెలిపారు. బాల‌య్య మౌనదీక్షపై మంత్రి శంకర్ నారాయణ స్పందించారు. ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి హిందూపూర్ అభివృద్ధికి కృషి చేయ్యని బాలయ్య రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏ జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు ఆలోచన రాలేదని ప్రశ్నించారు. కేవలం సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రమే బాలకృష్ణకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. పెనుగొండ జిల్లా కేంద్రం కావాలని తమకు కూడా కోరిక ఉందన్నారు. కానీ ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తి జిల్లా కేంద్రం ప్రకటించడం అందరికీ ఆనందదాయకమని శంకర్ నారాయణ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top