త్వరలోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలు విడుదల చేస్తాం

రైతులకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం

బీసీ సంక్షేమ మంత్రి శంకర నారాయణ

అనంతపురంః రైతులకు రాష్ట్ర  ప్రభుత్వం బాసటగా ఉంటుందని బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ అన్నారు.పెండింగ్‌లో ఉన్న ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ నుంచే రైతు  భరోసా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 12,500 ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పంటల బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సుపరిపాలనే  వైయస్‌ జగన్‌ లక్ష్యమని..నవరత్నా పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top