శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

 తిరుమ‌ల‌: పుట్టిన రోజు వేళ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తన జన్మదినం కావడంతో స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చానన్నారు రోజా. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.  

 
విజ‌య‌వాడ‌లో జ‌న్మ‌దిన వేడుక‌లు
మంత్రి ఆర్కే రోజా జ‌న్మ‌దిన వేడుక‌లు విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. హోం మంత్రి తానేటి వ‌నిత‌, మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి పద్మ‌, ల‌క్ష్మీపార్వ‌తి,  విజ‌య‌వాడ‌ మేయ‌ర్, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి త‌దిత‌ర మ‌హిళా నేత‌లు త‌దిత‌రులు రోజాకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top