టీడీపీ నేత బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా

 మంత్రి రోజా

విజయవాడ: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు.

‘‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’’ అంటూ మంత్రి రోజా మండిపడ్డారు.

Back to Top