రాజకీయంగా ఎదిగితే.. చూసి ఓర్వలేకపోతున్నారు

మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

‘ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు’

ఆ రోజు టీడీపీలో పని చేస్తే మంచిదాన్ని

టీడీపీ నచ్చక బయటకొస్తే నన్ను టార్చర్‌ చేస్తున్నారు

టీడీపీలో ఉన్న మహిళలు బండారు వాఖ్యలు స్వాగతిస్తున్నారు

మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరూ ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?

మాట్లాడితే సినిమా వాళ్ళు అంటారు.. టీడీపీ పెట్టిన ఎన్టీఆర్‌ సినిమా వ్యక్తి కాదా?

మంత్రి బండారు భార్య ను అడుగుతున్నా

ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు

కన్నీటి పర్యంతమైన మంత్రి ఆర్‌కే రోజా

 తిరుపతి: రాజకీయాల్లో 20 ఏళ్ళుగా ఉన్నా.. నేను రాజకీయంగా మంత్రిగా ఎదిగితే.. చూసి ఓర్వలేక నాపై అనుచిత వాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు.  మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీలో నచ్చక బయటకొస్తే తనను టార్చర్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మంగళవారం తిరుపతిలో మీడియా సమావేశంలో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడారు. 

 

బండారు మాటలకు అతని తల్లిదండ్రులు కూడా తలదించుకుంటారు:
దేశమంతా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని చర్చించి చట్టసభల్లో ఆమోదించినందుకు సంతోషించాలా..బండారు లాంటి వారి మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మహిళలు భయపడి ఆగిపోవాలా అనేది అర్ధం కాని పరిస్థితి. 
మన దేశంలో మహిళలను గౌరవించమని చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు నేర్పుతారు. 
కానీ బండారు సత్యనారాయణమూర్తి మాటలు విని అతని తల్లిదండ్రులు కూడా తలవంచుకుంటారు.
ఒక మహిళా మంత్రిగా మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా మాట్లాడారో చూశారు. 
అది విన్న వారు ఎవరైనా బండారు సత్యనారాయణమూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు. 
పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేస్తే రాష్ట్రంలోని మహిళలు స్వాగతిస్తున్నారు..సంతోషిస్తున్నారు. 
కానీ టీడీపీలోని వారు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటే చాలా బాధేస్తుంది. 

 మీ ఇంట్లో వాళ్లను కూడా ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?:

 • టీడీపీ నేతలను సూటిగా అడుగుతున్నా..గంటా, అయ్యన్నపాత్రుడు ..లోకేశ్‌ లాంటి వాళ్లను అడుగుతున్నా.
 • మీ ఇంట్లో కూడా మహిళలున్నారు. మీ తల్లిని కానీ, భార్యను కానీ, కూతుళ్లు, కోడళ్లను కానీ ఇలానే మాట్లాడితే మీరు సపోర్ట్‌ చేస్తారా? 
 • మాట్లాడితే సినిమా వాళ్లు అంటారు..మీ పార్టీ పెట్టింది మా ఎన్టీఆర్‌ గారు. 
 • ఆయన పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్లను చులకనగా మాట్లాడుతున్నారు. 
 • నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ చూస్తున్నా. అప్పటి నుంచి నా క్యారెక్టర్‌ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా గమనించారు. 
 • ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకీ శృతిమించి పోతోంది. 
 •  మీ ఇంట్లో ఉన్న ఆడోళ్లే ఆడోళ్ళా..? వైఎస్సార్సీపీలో ఉన్న ఆడోళ్లు ఆడోళ్లు కాదా..? 
 • మాకు మనసు లేదా..? ఫ్యామిలీ లేదా..? పిల్లలు లేరా..? 
 • మీరు ఏది మాట్లాడినా సర్ధుకుని వెళ్లిపోవాలా..? 
 • బండారు సత్యనారాయణమూర్తి భార్యను నేరుగా అడుగున్నా. ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడు అని తెలిసిందో ఆ రోజే చెప్పు తీసుకుని కొట్టి ఉంటే మళ్లీ మాట్లాడేవాడు కాదు. 
 • ఆయనకు కూతురు, కోడలు ఉన్నారు. వాళ్లిద్దరూ ఇలా ఒక ఆడదాన్ని మాట్లాడితే రేపు వాళ్లు తిరిగి మమ్మల్ని మాట్లాడరా అని లాగి చెంపపగలకొట్టాల్సింది. 
 • అతను మాట్లాడిన మాటలు చెప్పాలన్నా అసహ్యం వేస్తోంది... అంటూ మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.

 బండారు వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్‌ చేయడానికి సిగ్గు లేదా లోకేశ్‌..?:

 • ఇన్ని మాటలు మాట్లాడితే.. ఒక ఆడది ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది..? 
 • ఏ విధంగా మహిళల కోసం ఫైట్‌ చేస్తోందనేది మహిళలు అందరూ ఆలోచించండి. 
 • సిగ్గు లేకుండా బండారు సత్యనారాయణమూర్తి ఏం తప్పు మాట్లాడాడు అని లోకేశ్‌ ట్వీట్‌ చేశాడు. 
 • పదేళ్లు మీ పార్టీ  కోసం పనిచేశా. మా పార్టీ మనిషిని కాదు అన్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయిని ప్రచారానికి పిలిచావని ఆనాడు చంద్రబాబును అడగాల్సింది. 
 • నా క్యారెక్టర్‌ మంచిది కాదన్నప్పుడు ఈ అమ్మాయి ప్రచారం వద్దు..పంపించేయండి అని ఎందుకు అడగలేదు?
 • అంటే మీ పార్టీలో పనిచేస్తే మంచిదాన్ని..ఆ రోజు నేను గొల్డెన్‌ లెగ్‌ ఉన్న ఆడదాన్ని. 
 • మీ పార్టీలో నచ్చక నేను బయటకు వస్తే..మీ పార్టీకి దండం పెట్టి బయటకు వస్తే ఆనాటి నుంచి నన్ను ఎలా టార్చర్‌ పెడుతున్నారు. 
 • ఐరన్‌ లెగ్‌ అని మొత్తం జగన్‌ గారి కుటుంబంతో సహా అందరికీ మెసేజ్‌లు పంపింది మీరు కాదా? 
 • విజయమ్మ గారు నన్ను కన్నకూతురిలా, జగనన్న సొంత చెల్లెలులా నన్ను ఆశీర్వదించి రాజకీయాల్లో ముందుకు నడిపిస్తున్నారు. 
 • ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా లోపల అడుగు పెట్టిన రోజు నుంచీ నువ్వు బ్లూ ఫిలింలు చేశావ్‌.. అంటూ కించపరిచారు. 
 • ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఆ సీడీలు ఎందుకు ప్రెస్‌కు ఇవ్వలేదు? 
 • సుప్రీం కోర్టులే ఆర్డర్లు ఇచ్చాయ్‌..మహిళల్ని నచ్చినట్లు బతకమని. 
 • మీరెవరు అడగడానికి..? ఈ రోజు రాత్రిబవళ్లు నా కుటుంబం కోసం తప్పు చేయకుండా కష్టపడుతున్నా. 
 • ఎవరి ముందు చేయిచాచకుండా మహిళల హక్కుల కోసం, మహిళల సాధికారత కోసం పోరాడాను. 
 • ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో మహిళల అందరితో శభాష్‌ అనిపించుకుంటూ, మీరు రెండు సార్లు నన్ను ఓడించినా..జగన్‌అన్న ఆశీస్సులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 
 • ఇప్పుడు మంత్రి కూడా అయితే కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని టీడీపీ కంకణం కట్టింది. 

 మీకోసం ప్రచారం చేసిన సినిమా వాళ్లనందర్నీ ఇలానే మాట్లాడతారా?: 

 • మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా వాళ్లనందరినీ ఇలానే మాట్లాడతారా? 
 • ఎన్టీఆర్‌ గారు స్థాపించిన పార్టీ అనే జయప్రద, శారద, దివ్వవాణి, కవిత లాంటి వారు టీడీపీలోకి వచ్చారు. 
 • కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని చీఫ్‌గా, ఆటవస్తువుగా చూసే మీ విధానం చూసి అందరూ బయటకు వెళ్లిపోయారు. 
 • ఎందుకు మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్లిపోతున్నారో ఒక్క సారి మీ మనస్సాక్షిని అడగండి. 
 • నాకు ఎన్టీఆర్‌ అంటే ప్రాణం అంటున్నావు కదా..నీకు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్‌ చేశావ్‌..? 
 • ఆయన చావుకు కారణమైన చంద్రబాబు కాళ్లు ఎందుకు నొక్కుతున్నావు..? ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం.
 • ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని ఆయన కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్ల గురించి వారి కుటుంబానికి ఏదో అయిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా? 
 • ఈ రోజు మేం ఫైట్‌ చేస్తున్నది కూడా ఎన్టీఆర్‌ గురించే. ఆ ఎన్టీఆర్‌కు అన్నం పెట్టని వారు, ఆ ఎన్టీఆర్‌పై చెప్పులు వేసి ఆయన ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు కోసం రోడ్లపైకి వచ్చి డ్రామాలు చేస్తుంటే మేం పోరాడుతున్నాం. 
 • ఆ ఎన్టీఆర్‌ గారికి అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఎక్కడకు వెళ్లారు అని అడిగాం. 
 • దానిలో బూతుందా..? తప్పు చేసినప్పుడు ఎవరూ ప్రశ్నించరా? 
 • ప్రశ్నిస్తే మా క్యారెక్టర్లపై రాళ్లు వేస్తారా? 
 • అసలు నువ్వెవరు నా క్యారెక్టర్‌ జడ్జి చేయడానికి? నీకేం అధికారం ఉంది..? 

అయ్యన్నపాత్రుడు నీ భార్యను ఏమన్నాడో చూసుకో లోకేశ్‌:

 • లోకేశ్‌ తెలుసుకోవాలి..ఇలాంటి అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తిలను ఎంకరేజ్‌ చేసి నన్ను తిట్టించి నా నోరు మూయించాలి అనుకున్నావు. 
 • కానీ నీ పరిస్థితి ఏమైంది..? అదే అయ్యన్నపాత్రుడు నీ భార్యను ఏమన్నాడో ఒకసారి చూసుకో. 
 • బాలకృష్ణ కూతురు, లోకేశ్‌ పెళ్లాం..అదెవరూ దాని పేరేంటి అన్నాడు.
 • ఒకరి మీద దుమ్మెత్తి పోయాలంటే నీ మీద కూడా పడుతుంది. 
 • ఈ రోజు ఆ పరిస్థితి నీ పెళ్లానికి వచ్చింది. బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి. 
 • నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు బ్రాహ్మణి చిన్నపాప. ఈ పాపకు జడలు కూడా మేమే వేశాం..పక్కన కూర్చోబెట్టుకుని ఆడించుకున్నాం. 
 • ఇంత వరకూ తాను పాలిటిక్స్‌ మాట్లాడలేదు..మేమూ మాట్లాడలేదు. 
 • ఈ రోజు చంద్రబాబు, లోకేశ్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ తీసుకుని జగన్‌ గారిని సైకో అంటే మేమెలా ఒప్పుకుంటాం. 
 • అమెరికాలో చదివితే అబద్దాలు చెప్పొచ్చా..బాలకృష్ణ కూతురు అయితే అబద్దాలు చెప్పొచ్చా. అబద్దాలు చెప్పకూడదు అని చెప్తే అది తప్పు.

వైయ‌స్ జగన్‌ గారిపై ఎందుకేడుస్తున్నారు..మీ బాధ కోర్టులకు చెప్పుకోండి:

 • దొంగలా సాక్షాలతో దొరికిన చంద్రబాబును కోర్టులు ఆయన్ను లోపలపెట్టాయి. 
 • 2017లో జీఎస్టీ వారు లెటర్‌ ఇచ్చారు. 2020లో చంద్రబాబు పీఏ ఇంట్లో రైడ్‌ అయింది. 
 • ఈడీ నోటీసులిచ్చారు. నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. డిజైన్‌ టెక్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. 
 • ఇవన్నీ కేంద్రంలో ఉన్న సంస్థలే కదా చేసింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు..? 
 • ఇప్పుడు తప్పు చేసి అరెస్ట్‌ అయితే జగన్‌ గారిపై ఎందుకు ఏడుస్తున్నారు..? 
 • కోర్టుకు వెళ్లండి..జడ్జిగారి ముందుకు వెళ్లి ఆధారాలు చూపండి. 
 • జగన్‌ గారిని ఏదంటే అది మాట్లాడితే మేం చూస్తూ ఉండాలా ..మాట్లాడితే మా క్యారెక్టర్‌ బాగాలేదంటూ నిందలు వేస్తారు. 
 • రాష్ట్రంలో ఉన్న మహిళలంతా బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారి మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. 
 • దీన్ని మేధావులు అందరూ ఖండించాలి. ఈ రోజు నాకు వచ్చింది..రేపు మీకూ వస్తుంది. 
 • రేపు మీ, మా ఆడపిల్లలు వాళ్ల కలలు సాకారం చేసుకోడానికి ఎలా బయటకు వస్తారు..? 
 • బయటకు వస్తే ఏం మాట్లాడతారో, ఏం బురదజల్లుతారో అని మళ్లీ వంటింటికే పరిమితం కావాలా..? 

టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనుల పార్టీ:

 • తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీలా మారిపోయింది. 
 • బండారు సత్యనారాయణమూర్తి క్యారెక్టర్‌ అందరికీ తెలిసిందే. 
 • ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత మహిళలను వివస్త్రను చేసి కొట్టారు. ఆనాడు నేను పోరాడాను. 
 • ఆ రోజే చంద్రబాబు ఈ బండారును అరెస్టుచేసి ఉంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడి ఉండే వాడు కాదు. 
 • కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబే ఆడదాని పుట్టకనే అవహేళన చేస్తూ ఆడదానిలా పుట్టాలని ఎవరనుకుంటారు అన్నాడు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో ఆడవారిని వ్యభిచారం కూపంలోకి దింపుతున్నారని పోరాడితే ఏడాది పాటు నన్ను అసెంబ్లీలోకి రానివ్వలేదు. 
 • కోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా నన్ను అసెంబ్లీకి రానివ్వలేదు. 
 • దళిత మహిళను బూటుకాలుతో తన్నిన అచ్చెన్నాయుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.
 • ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టిన చింతమనేని వాళ్లకి అభిమాన నాయకుడు. 
 • ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టండి..కడుపైన చేయండి అనే వ్యక్తి బాబుగారికి ముద్దుల బావమరిది. 
 • ఆడపిల్ల అంటే ఆటవస్తువు..దానితో ఎంజాయ్‌ చేయాలంటూ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన లోకేశ్‌కి మహిళలంటే ఎంత చిన్నచూపో చూడండి. 
 • ఇలాంటి వారున్న తెలుగుదేశం పార్టీ మహిళలకు ఏం గౌరవం ఉంటుంది.? 
 • వారు ఏ విధంగా మహిళలను చూస్తారో ఈ రాష్ట్రంలోని మహిళలు ఆలోచించాలి. 

వైయ‌స్ జగన్‌ గారు ప్రతి మహిళనూ సొంత అక్కచెల్లిలా చూసుకుంటున్నాడు:

 • జగన్‌ గారు ప్రతి మహిళను సొంత అక్క చెల్లిలా ఆశీర్వదిస్తూ అండగా నిలిచారు. 
 • మహిళా సాధికారత దిశగా అందర్నీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తున్నారు. 
 • మహిళలపై దారుణంగా మాట్లాడుతూ వారసులు బయటకు రావడానికే సిగ్గుపడే విధంగా ఇలాంటి అబద్దాలు నీచమైన పనులు చేస్తుంటే వాటిని ఎంకరేజ్‌ చేసే చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌లను మహిళలంతా కలిసి తరిమికొట్టాలా వద్దా అనేది ఆలోచించాలి. 
 • నేనేదో మంత్రిని కాబట్టి ఆయన్ను అరెస్ట్‌ చేయాలని కాదు..అందరూ మహిళలే. 
 • ఏ మహిళకైనా మనసుంటుంది. చేయని తప్పుకు నింద వేసి, ఆమెను అవమానించి గొంతు నొక్కాలనుకోవడం ఎంత వరకూ కరెక్ట్‌..? 
 • టీడీపీ వారికి చెప్తున్నా..మీకు దమ్ముంటే నేను మా శాఖలో పనిచేయలేదా..ప్రశ్నించండి. 
 • నా నియోజకవర్గానికి రండి...30, 40 ఏళ్లుగా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నాలుగున్నరేళ్లలో ఏం చేశానో చూపిస్తాను. దానిపై చర్చించండి. 
 • మీరు నా గొంతు నొక్కాలని చూస్తే అది మీ వల్ల కాదు. 
 • నా ప్రాణం ఉన్నంత వరకూ జగనన్నకు మద్దతుగా, మహిళలకు మద్దతుగా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను. పోరాడతాను. 
 • ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే కచ్చితంగా ఈ సారి నేను వదలను. ఎంత దూరం వరకైనా పోరాడతాను. 
 • అరెస్ట్‌ చేశారని బండారును వదిలేయను..కచ్చితంగా పరువునష్టం దావా వేస్తాను..న్యాయపోరాటం చేస్తాను. 
 • మహిళ గురించి ఎవడైనా దిగజారుడుతనంగా మాట్లాడాలి అంటే భయపడే విధంగా నేను పోరాడతాను. 

తాజా వీడియోలు

Back to Top