మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా..?

మంత్రి ఆర్కే రోజా సూటి ప్ర‌శ్న‌

విజయవాడ:   ప్ర‌ధాన మంత్రి మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా..? అని మంత్రి ఆర్కే రోజా సూటిగా ప్ర‌శ్నించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ,, రూ.11 వేల కోట్లతో స్థలాలు కొంటే రూ. 15 వేల కోట్ల అవినీతి అంటున్నాడని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు నోవాటైల్‌లో ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నాడు. 71 వేల ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం పంచిన ఘనత జగన్‌దే. దేశంలో ఏ సీఎం అయినా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారా?. ప్రధానితో రాష్ట్రం కోసం పవన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పలేదు?. అసలు మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా..?  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రజల సమక్షంలో ప్రధానికి మన సమస్యలు విన్నవించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం వైయ‌స్ జగన్‌ కృషి చేస్తున్నార‌ని మంత్రి రోజా అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top