మిమ్మల్ని పంచభూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా..? 

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా  

 మీరు ఎన్టీఆర్ కు అన్నం పెడితే.. బాబు వెన్నుపోటు పొడిచేవాడా..? 

 మీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబును మీ బ్లడ్, బ్రీడ్ ఏమీ చేయలేదా..? 

  ఉత్తరాంధ్ర, రాయలసీమలో రైతులు లేరా, వారికి అభివృద్ధి వద్దా..?

  29 గ్రామాల కోసం 26 జిల్లాలకు నష్టం చేస్తారా..? 

 

 విశాఖ‌:  ఎన్టీఆర్ ను చంపేసిన చంద్ర‌ బాబును, మిమ్మల్ని పంచభూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా..? అని మంత్రి ఆర్కే రోజా ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై.. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడటం సిగ్గు చేటు. నా సహచర నటుడు బాలకృష్ణ చేసిన ట్వీట్ మరింత బాధాకరమ‌న్నారు. విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి అంటున్న బాలకృష్ణను సూటిగా ప్రశ్నిస్తున్నాను... విశ్వాసం లేనిది ఎవరికి మీకా, మాకా అని..?  ప్ర‌శ్నించారు. పిల్లనిచ్చి పెళ్ళిచేసి, మంత్రి పదవి ఇచ్చి, రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. అంటువంటి ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన వాడికా విశ్వాసం లేనిది.. లేక, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా మీకు ఒక అడ్రస్ ఇచ్చి, ఆస్తులు ఇస్తే.. కనీసం తండ్రికి అన్నం పెట్టలేని మీకా విశ్వాసం లేనిది..?

  ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన పార్టీ ట్రస్టు ఆస్తులను లాక్కుని, బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబును, ఆయన అక్రమాలకు అండగా నిలిచిన మిమ్మల్ని పంచ భూతాలు ఏమీ చేయవా బాలకృష్ణా..?

 అమరావతి రైతుల పేరుతో చేస్తున్న యాత్ర... కేవలం చంద్రబాబు, తన బినామీల భూములను కాపాడుకోవడం కోసం, అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెంచుకోవడం కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేయిస్తున్న యాత్రే తప్పితే అది రైతుల కోసం చేస్తున్న యాత్ర కాదు.  తన స్వార్థం కోసం, 29 గ్రామాల కోసం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు నష్టం చేసే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు చేస్తున్నారు. 

 పాదయాత్ర పేరుతో కోర్టులో పర్మిషన్ తెచ్చుకుని, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే రైతుల ముసుగులో ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్నారు. ఒక్క అమరావతిలోనే రైతులు ఉన్నారా... ఉత్తరాంధ్రలో, రాయలసీమలో రైతులు లేరా.. వారు బాగుపడవద్దా..?.  వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందకూడదా..?

 గతంలో రాష్ట్ర సంపదనంతా హైదరాబాద్ లో పోసి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుని, రాష్ట్ర విభజనతో దాన్ని వదులుకుని వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికే చాలా నష్టపోయాం. గతంలో చేసిన తప్పు రిపీట్ కాకూడదు. భవిష్యత్తులో ఇటువంటి  నష్టం మనకు రాకూడదు. ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ గారు పెద్ద మనసుతో నిర్ణయం తీసుకుంటే.. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వంపైన బురదచల్లుతున్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. 

 నిజంగా చంద్రబాబుకు అమరావతి మీద ప్రేమే ఉంటే.. అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో ఎందుకు కట్టలేకపోయావు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఎల్లో మీడియాలో గ్రాఫిక్స్ చూపించి, నాలుగు టెంపరరీ బిల్డింగ్ లు కట్టి.. వాటిల్లో కూడా దోచుకున్నారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ వాస్తవంగా అక్కడ లేవు కాబట్టే, ఆ ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. రెండు చోట్లా మిమ్మల్ని ప్రజలు ఓడించారు. అమరావతి ప్రాంతంలో రెండు సీట్లల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచిందంటేనే దాని అర్థం ఏమిటి..?. అది కేవలం భ్రమరావతే గానీ అమరావతి కాదు అని ప్రజలు తీర్పు ఇచ్చినట్టే కదా..?. అక్కడ మీరు, మీ బినామీలు భూములు దోచుకున్నారనే కదా..?

  
 ఎన్టీఆర్ కు ఇంత ద్రోహం చేసిన చంద్రబాబుకు ఇంకా మీరు తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారు...? మీ బ్లడ్ వేరు.. మీ బ్రీడ్ వేరు అని చెబుతున్నారు కదా.. బతికుండగానే మీ తండ్రిని చంపిన చంద్రబాబును మరి, మీ బ్లడ్, బ్రీడ్. ఏమీ చేయలేదా..?

 తన తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటుకు గురి చేసి.. ఆయన చావుకు కారణమైన ఎపిసోడ్ లో పురంధేశ్వరి పాత్ర లేదా...ఆమె ఇప్పుడు నీతులు చెప్పడమా..?. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, చివరివరకు కాంగ్రెస్ ను వ్యతిరేకించిన ఎన్టీఆర్ గారి కూతురు అయి ఉండి, కాంగ్రెస్ లో చేరి, మంత్రి అయింది మరిచిపోయారా..?. చివరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయేసరికి, బీజేపీలో చేరిన ఆమెకు, రాజకీయ ఊసరవెల్లిల్లా రంగులు మార్చడమే గానీ.. కన్నతండ్రి మీద ప్రేమ లేదు. 

 మీరంతా మీ తండ్రికి అన్నం పెట్టి ఉంటే... ఆయన్ను బాగా చూసుకుని ఉంటే.. వెన్నుపోటు పొడిచే అవకాశమే చంద్రబాబుకు వచ్చేది కాదు కదా..?. ఇప్పటికీ ఎన్టీఆర్ గారు బతికి ఉండేవారు. రాజకీయాల్లో ఓ పెద్ద పొజీషనల్ లో ఉండేవారు ఆయన. మీరంతా దగ్గరుండి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిపించి, ఆయన చావుకు కారణమై.. తగుదునమ్మా.. అంటూ ఈరోజు మా పార్టీని, ముఖ్యమంత్రిగారిని విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. 

 ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలని, వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు కూడా మరణించకూడదని, ఆరోగ్యశ్రీ సృష్టికర్తగా వైఎస్ఆర్ గారు కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిస్తే.. ఆయన కొడుకుగా, ముఖ్యమంత్రి జగన్ గారు నాలుగు అడుగులు ముందుకేసి, రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తూ,  సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు ఎర్పాటు చేయాలని, 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ, ప్రతి సచివాలయం పరిధిలో విలేజ్ క్లినిక్ లు తెస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ ను తెస్తున్నారు.  పేదల ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్న, మేలు చేస్తున్న వైఎస్ కుటుంబం గురించి అవాకులు, చెవాకులు మాట్లాడితే మర్యాదగా  ఉండదు.. అని రోజా హెచ్చరించారు.
 

Back to Top