డేటా దొంగ చంద్రబాబు..డేరా బాబా కంటే డేంజర్‌

మంత్రి ఆర్కే రోజా
 

అమరావతి: డేటా దొంగ చంద్రబాబు..డేరా బాబా కంటే డేంజర్‌ అని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మంగళవారం మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడారు.  
 ప్రజల డేటాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారు. డేటాను చోరీ చేయాలనే ఈ దుష్ట సాంప్రదాయానికి తెర లేపారు.  దానిపై హౌస్‌ కమిటీ వేసి ఈ రోజు ఆ రిపోర్టును హౌస్‌ కమిటీ పెట్టగానే టీడీపీ నేతల గుండెలు జారాయి. దీనిపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే కచ్చితంగా జీవితాంతం జైల్‌లో ఉంటారు. ఈ డేటా దొంగ డేరా బాబా కన్న డేంజర్‌ అన్నది గమనించాలి. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సాప్ట్‌వేర్‌ చంద్రబాబు కొనుగోలు చేశారని ఆమె చెప్పారు. ప్రజా సాధికారత సర్వేలో మొత్తం డేటా తీసుకున్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే..దాదాపు 30 లక్షల ఓటర్లను తొలగించాలని దుర్మార్గంగా ఆలోచన చేశారు. దీనిపై సమగ్ర విచార ణ జరగాలి. ఓటర్లు డిలీట్‌ చేయడమే కాకుండా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేయించుకొని, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆ రోజు టీడీపీ చేర్చుకున్నారు. ఇలాంటి వాళ్లను వదిలిపెడితే సమాజం భ్రష్టుపడుతుంది. 
లోకేష్‌ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఒళ్లు తగ్గించడానికి ఏవేవో చేశాడు. ఒళ్లుతో పాటు బు్రరలో ఉన్న గుజ్జు కూడా పెంచుకోవడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది.  అసెంబ్లీలో ఇచ్చిన టీడీపీవాయిదా తీర్మానం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అన్నా క్యాంటీన్లపై మొదటి సంతకం చేయాలి. ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన మీరు ఈ రోజు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా?
 వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేరుస్తూ వచ్చారు.  మూడేళ్లలోనే 98 శాతం వాగ్ధానాలు అమలు చేశారు. వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీతోఫా పథకాలను అక్టోబర్‌ 1వ తేదీన అమలు చేస్తున్నారు. టీడీపీ ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇస్తున్నారు.
అమ్ముడపోని నెయ్యి, పెరుగును అమ్ముకోవడానికి చంద్రన్న కానుక అంటూ ప్రజలకు అంటగట్టారు. ప్రజలే సొంతంగా పండుగలు చేసుకునేలా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు. 
అంబేద్కర్‌ విదేశీ విద్యాలో టీడీపీ ఏవిధంగా దోచుకున్నారు. దాన్ని సక్రమంగా అమలు చేసేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచంలో 200 యూనివర్సిటీల్లో చదివే వారికి విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నాం. 
చంద్రబాబు మోహానికి ఏ ఒక్క రోజైనా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారా? సిగ్గులేకుండా అమ్మ  ఒడి పథకాన్ని కుదించామని చెబుతున్నారు. ఈ రోజు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి డబ్బులు జమ చేస్తున్నారు. రాజకీయంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలను అభిమానించే నాయకుడు కాబట్టే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి తీసుకువచ్చారు.
టీడీపీ నేతలను ప్రజలు మెంటల్‌ ఆసుపత్రిలో చేర్పించాలని ఉత్సాహంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో రుణాలు మాఫీ చేస్తామని టోకరా పెట్టింది చంద్రబాబే. వైయస్‌ జగన్‌ మాట ఇచ్చిన ప్రకారం వైయస్‌ఆర్‌ ఆసరా పేరుతో నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు సంబంధించి రుణాలను నాలుగు దఫాల్లో వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ అన్నలా ఆలోచించి అందరికీ న్యాయం చేస్తున్నారు. దాదాపుగా రూ.3800 కోట్లను వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద మూడేళ్ల కాలంలోనే మహిళలకు ఇచ్చారని కళ్లు ఉండి చూడలేని నేతలకు చెబుతున్నాను. 
దయ్యాలు వేదాలు వల్లించినట్లు సంక్షేమమే లేదు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. సంక్షేమానికి, టీడీపీకి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు ఒక మంచి పథకాన్ని అయినా తెచ్చారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా?. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకువచ్చారు. ఏ ఒక్క పథకాన్ని సొంతంగా అమలు చేయని చంద్రబాబు..ఈ రోజు వారి పథకాల పేర్లు మార్చుకున్నారని వైయస్‌ జగన్‌ను విమర్శిస్తున్నాడు. చిన్న రాజప్పహోమంత్రిగా ఉన్నప్పుడు హోంకే పరిమితయ్యారు. ఆ రోజు జరిగిన అవకతవలను ఏ రోజు సరిచేయని మంత్రి. టీడీపీ నేతలకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి రోజా పేర్కొన్నారు. ఈ రోజు దేశంలోని అన్ని పార్టీలు, నాయకులు వైయస్‌ జగన్‌ వైపు తిరిగి చూస్తున్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రణాళికలు రూపొదిస్తున్నారు. రూ.1.60 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైయస్‌ జగన్‌దని మంత్రి రోజా వివరించారు.
 

Back to Top