తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన దిశ చట్టం స్ఫూర్తితో రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరి శిక్ష పడిందని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. బీ టెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరి శిక్ష ఖరారు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఉరి శిక్ష ఖరారు చేసిన గుంటూరు కోర్టు న్యాయవాదికి ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం, ఐదు రోజుల్లోనే చార్జ్‌షిట్ వేసి త్వరితగతిన విచారణ జరిగేలా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ చేపట్టి 8 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్ష వేయడం సీఎం వైయస్ జగన్ పరిపాలన గొప్పతనమని చెప్పారు. దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజుల్లోనే తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయవచ్చు. అప్పుడు నిందితులకు తప్పు చేయాలన్న భయం ఉంటుంది. ఆడ పిల్లకు రక్షణ ఉంటుందని మా సీఎం వైయస్ జగన్ చెప్పింది ఈ రోజు అందరికీ అర్థమైంది. దిశ చట్టం కేంద్రంలో ఆమోదం పొందకపోయినా ..దిశ స్పూర్తితో సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని పట్టుకొని 10 గంటల్లో అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్టులు చేయించి నిందితుడైన శశికృష్ణకు ఉరి శిక్ష వేయగలిగారు. ఈ రోజు మహిళా లోకమంతా వైయస్ జగన్‌కు జేజేలు పలుకుతోంది. మహిళలకు దిశ చట్టం అంటే ఏంటో అర్థమైంది. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లను చూడాలన్నా..వాళ్లపై దాడి చేయాలన్నా, అమ్మాయిలను చంపితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. నిందితుల్లో భయం ఉంటుంది. తప్పు చేయాలంటేనే భయపడుతారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు ఒక్కటే చెబుతున్నాను. ఆడపిల్లలపై ఏదైనా చిన్న ఘటన జరిగినా రాజకీయాలు చేయడం మానుకోండి. మహిళలకు రక్షణ కల్పించే విధంగా టీడీపీ పాలనలో ఏనాడైనా ఫాస్ట్రాక్ కోర్టులు తీసుకువచ్చిందా? దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌లు తెచ్చిందా?. పోలీసులు పది నిమిషాల్లో వెళ్లి రక్షణ కల్పించారు. ఆడవాళ్లను అవమానిస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయని ఆర్కే రోజా హెచ్చరించారు.