తిరుగులేని దీక్ష‌కు సంకేతం ప్ర‌జా సంక‌ల్పం

 రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

 ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆరేళ్లు పూర్తి

శ్రీ‌కాకుళం: తిరుగులేని దీక్ష‌కు సంకేతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కితాబిచ్చారు. 
ఆ రోజు విప‌క్ష నేత హోదాలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఇవాళ (న‌వంబ‌ర్ ఆరు, 2023తో) ఆరేళ్లు పూర్త‌య్యాయి. నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ టౌన్ హాల్ లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. తొలుత దివంగ‌త నేత వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. అనంత‌రం వేడుక‌లు నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి కార్య‌క‌ర్త‌ల‌కు పంచి పెట్టారు. 

ఈ  సంద‌ర్భంగా..మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ...పాదయాత్రలో గుర్తించిన అంశాలను,పాలనకు అనుగుణంగా ప‌లు మార్పులు చేసి,ఉన్న చట్టాల్లో సవరణలు చేస్తూ..నీతివంతంగా పాలన సాగిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. గతంలో రాజకీయం పార్టీ కార్య‌క‌ర్త అంటే,అధికారంలోకి వచ్చేందుకు తోడుగా ఉన్న పార్టీ సేవ‌కులు అని మాత్ర‌మే అనుకునే వారు. వారి సంక్షేమం మాత్రమే చూసి,మిగిలిన వర్గాలకు మొండి చేయి చూపించేవారు. కానీ ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వివక్షకు తావే లేకుండా పాలన సాగిస్తున్నాం. అన్ని వ‌ర్గాల‌కూ అన్ని పార్టీల‌కూ  చెందిన వారికీ కులం మతం అన్న ప‌ట్టింపు లేకుండా, బేధ భావానికి తావే లేకుండా ప‌నిచేస్తున్నాం. 

ప‌థ‌కాలు అందిస్తున్నాం. భారత రాజ్యాంగం లో ఉన్న అంశాలను ఏర్పాటైన ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాలు అర్హుల‌యిన అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. గడిచిన 75 ఏళ్లలో చాలా ప్ర‌భుత్వాలు ఆ విధంగా చేయలేదు. కానీ..ఇందుకు భిన్నంగా నాడు వైయ‌స్ఆర్ చేస్తే..నేడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. అన్ని వ‌ర్గాల ఉన్న‌తికీ పాటుప‌డుతున్నారు. ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ రోజు మా పార్టీకి ఓటు వేయని వారు కూడా ఈ రోజు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ను విమర్శించడం లేదనే అంశాన్ని గ్రామాల్లోకి వెళ్లి నప్పుడు తెలుస్తోంది.

మీ అందరి మ‌ద్ద‌తుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ రోజు ఇన్ని సంస్కరణలు చేస్తూ ఉంటే.. పార్టీ శ్రేణులకు గౌరవం పెరిగింది. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ విషయంలో అధికారులు కానీ,పార్టీ శ్రేణులు కానీ ఎవ్వరూ అవినీతికి తావు ఇవ్వడం లేదు. అలానే 2.3 లక్షల కోట్లు డీబీటీ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందజేశాం. ల‌బ్ధిదారుల ఆత్మ గౌరవం దెబ్బతినకుండా పథ‌కాలు వ‌ర్తింప జేశాం. వీరంతా స్వేచ్ఛగా,ఎవ్వరికీ సలాం కొట్టకుండా ప‌థ‌కాల ద్వారా ఆర్థిక ల‌బ్ధిని అందుకున్నారు. ఇదంతా మనం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ కి అధికారం రావడం వల్లనే సాధ్యం అయ్యింద‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు.

ఆ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా నాన్న వైయ‌స్ఆర్  స్ఫూర్తితో ఏడాదిన్నర పాటు శక్తి వంచన లేకుండా రాష్ట్రం మొత్తం తిరిగారు, ప్రతి ఒక్కరినీ పలకరించారు. పౌరుల ఆవేదన చూశారు, కన్నీరు చూశారు. అప్పటి నుంచి సమాజనని మార్చాలి అని దృఢ సంకల్పం ఏర్పరుచుకున్నారు..జగన్. ఏ సమస్య సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ ముందుకు వచ్చిన ప్రతి దానికి ఒక గొప్ప పరిష్కారం చూపించగ‌లుగుతు న్నారు. గొప్ప ముఖ్య మంత్రి ఆయ‌న. అందుకు కార‌ణం తన పాద యాత్రలో ప్రజల కష్ట నష్టాలు దగ్గర నుంచి చూడ‌డం..ఆరోజు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయి వారి క‌ష్ట‌,సుఖాల‌ను తెలుసుకోవ‌డం.

రెండేళ్లు కరోనాతో యుద్ధం చేశాం..దేశంలో అందరి కంటే బాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా చేసింది. సంస్కరణలు వచ్చినప్పుడు..క్షేత్ర స్థాయిలో చిన్న,చిన్న అడ్డంకులు తప్పవు.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య ఆరోగ్య సేవ‌ల‌ను చేరువ చేయ‌గ‌లిగాం. ప్ర‌తి ఇంటికి వెళ్లి ఆరోగ్య రీత్యా వారికి ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌గ‌లిగాం. సమూల మార్పులు ఈ నాలుగేళ్లలో చేపట్టాం..అందుకనే విమ‌ర్శ‌ల‌కు తావే లేదు.. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.

Back to Top