చంద్ర‌బాబు ప‌డ‌గొట్టిన ఆల‌యాలు మా ప్ర‌భుత్వం నిర్మిస్తోంది

దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ 
 

అమ‌రావ‌తి: చంద్రబాబు హయాంలో పడగొట్టిన 23 దేవాలయాలకు గాను 19 దేవాలయాలను పునరుద్ధరించడం జరిగింద‌ని, మరో 4 దేవాలయాల పనులు మొదలు పెట్టాల్సి ఉంద‌ని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో మంత్రి స‌మాధానం ఇచ్చారు. కృష్ణా పుస్క‌రాల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 23 దేవాలయాలు నిర్దాక్షణ్యంగా పడగొట్టింది. ఆగమ శాస్త్ర పండితులను కనీసం సంప్రదించలేదు. ఆ విగ్రహాలను చెత్త ఎత్తే మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీయించారు. భక్తుల విశ్వాసాలను ఎంతో దెబ్బతీశారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల టైమ్ లో కోట్లాదిరూపాయిలతో కట్టిన నిర్మాణాలు నెల తిరిగేసరికి ఏమయ్యాయో తెలీదు? . ఏదో అట్టహాసంగా చేసామని చూపించుకోవడం కోసం, ఓ సినిమా డైరెక్టర్ సలహాతో అప్పటి సీఎం బాబు స్నానం చేసే దృశ్యాన్ని చిత్రీకరించడం కోసం చేసిన హడావిడిలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు.  కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. కృష్ణా పుష్కరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కోట్లు వెచ్చించారు. కానీ రెండు నెలల తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కనిపించడం లేదని  దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

సీజీఎఫ్‌ నిధులకు సంబంధించి

2014-19 వరకూ 358 పనులకు రూ.114.09 కోట్లు ఖర్చు పెడితే
2019-23 వరకూ 478 దేవాలయాల్లో రూ.234.95 కోట్లు సీజీఎఫ్‌ నిధుల నుండి ఖర్చు చేసారు.
బలహీన వర్గాల కాలనీల్లో దేవాలయాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం 189 దేవాలయాలు రూ.9.43 కోట్లు ఖర్చు పెట్టింది.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ 11028 దేవాలయాలను  రూ.110 కోట్లతో అభివృద్ధి చేసాం. 
 

తాజా వీడియోలు

Back to Top