నరసరావుపేట: వవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సామాజిక న్యాయం చచ్చిపోయిందని, బడుగు, బలహీనవర్గాలు వెనకబడే ఉన్నారని, అలాంటి వారందరినీ ముందుకు నడిపించిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 62 లక్షల పెన్షన్లు ఇస్తే, వారిలో 46 లక్షల మంది గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు ఉన్నారని, అలాగే అమ్మ ఒడి పథకంలో 34 లక్షలకు పైగా ఈ వర్గాలే ఉన్నాయని, వైయస్సార్ ఆసరాలో 79 లక్షల అక్కచెల్లెమ్మలు ఉంటే, వారిలో 60 లక్షలు, చేయూతలో 25 లక్షల అక్కచెల్లెమ్మలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు. నరసరావుపేట బహిరంగ సభలో మంత్రి రాజన్న దొర పాల్గొని మాట్లాడారు. నక్కజిత్తుల చంద్రబాబును అస్సలు నమ్మొద్దు అని మంత్రి రాజన్న దొర అన్నారు. మహానాడులో చంద్రబాబు ఎవరెవరితోనో మాట్లాడిస్తూ.. సీఎం వైయస్ జగన్‌ను నిందిస్తున్నారని, చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అందుకే ఆ మహానాడు, ఏడుపునాడులో చంద్రబాబు మాటలు పట్టించుకోవద్దు. ఆయనకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.