మహిళా సంరక్షణ కోసం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం

ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి
 

తాడేపల్లి: మహిళా సంరక్షణ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ  ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై విధేయత, ఆయన ఆశయాలను, ఆలోచనలు అనుగుణంగా ముందుకెళ్లే వాసిరెడ్డి పద్మదన్నారు. న్యాయవాదిగా పనిచేసి న్యాయం కోసం పోరాటం చేసిన వాసిరెడ్డి పద్మ కచ్చితంగా మహిళలకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానన్నారు. వేదిక అనేక పత్రిక ద్వారా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం సీఎం వైయస్‌ జగన్‌ గతంలో ఎన్నో పోరాటాలు చేశారని, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో, నామినేటెడ్‌ వర్కుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రిని చెప్పారు. మహిళా కమిషన్‌ ద్వారా వాసిరెడ్డి పద్మ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మహిళలకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందన్నారు. 

Back to Top