ప్రజల నమ్మకానికి మిన్నగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే మీటర్లు

రైతులెవరూ చంద్రబాబు మాయలో పడవద్దు

రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

విజయవాడ: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని, మీటర్ల వల్ల ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించిన నగదు రైతుల అకౌంట్లలోకి నేరుగా బదిలీ అవుతుందని, ఆ తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుందన్నారు. విజయవాడలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సర్కార్‌ రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించనుందన్నారు. 

రైతులు అపోహలకు గురికావొద్దు.. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు అని కోరారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే డిస్కమ్‌ కంపెనీలు అప్పులపాలయ్యాయన్నారు. రైతులెవరూ చంద్రబాబు మాయలో పడవద్దు.. మాయ మాటలు నమ్మవద్దు అని సూచించారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పేపర్లు, టీవీల మాటలు వినకుండా.. రైతుల మేలు కోసం పనిచేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశ్వసించాలని కోరారు. ప్రజలందరి నమ్మకానికి మిన్నగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టే ప్రతీ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు చూస్తున్నాయన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top