రైతుల ముసుగులో బాబు ఏజెంట్లు, బినామీల పాదయాత్ర

పాదయాత్ర పేరుతో బ్లాక్‌మనీని.. వైట్‌గా మార్చుకుంటున్నారు

27 ఏళ్లలో కుప్పంకు చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్లారు..?

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజం

తాడేపల్లి: రైతుల ముసుగులో చంద్రబాబు ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని, నిజమైన అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అమరావతి రైతుల కళ్లకు గంతలు కట్టి బాబు భూములు లాక్కున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రియలెస్టేట్‌ వ్యాపారం చేసింది చంద్రబాబేనని మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా టీడీపీ దొంగ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. పాదయాత్రకు స్క్రీన్‌ప్లే, నిర్మాత, డైరెక్షన్‌ మొత్తం నయవంచకుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. 

పాదయాత్ర పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు బ్లాక్‌మనీని.. వైట్‌మనీగా మార్చుకుంటున్నాడని విమర్శించారు. పోలీసులపై సైతం టీడీపీ నేతలు దాడులు, దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కుప్పంలో చంద్రబాబు పీకిందేమిటీ..? అని ప్రశ్నించారు. ఓటర్లను కొనుగోలు చేసే మనస్తత్వం చంద్రబాబుదని, 27 ఏళ్లలో కుప్పంకు చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్లారని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికితే.. సాయంత్రానికల్లా హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి కరకట్టకు చేరాడన్నారు. నక్కలాంటి చంద్రబాబుకు.. గుంటనక్క లాంటి లోకేష్‌ పుట్టాడని ఎద్దేవా చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top