గ్లాస్‌ నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదు

రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

విజయవాడ: రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు చేస్తున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణానది నుంచి గ్లాస్‌ నీరు కూడా ఏపీ అదనంగా తీసుకోవడం లేదని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామన్నారు. జలాల వినియోగంపై సందేహాలుంటే చర్చించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సూచించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని చెప్పారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతతో ఉండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ విధానమని మంత్రి స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top