ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి

90 రోజుల్లో ఆర్టీసీ విలీనంపై నిపుల కమిటీ నివేదిక

అద్దె బస్సులు ఫిట్‌నెస్‌ లేకపోతే డిపో మేనేజర్‌పై చర్యలు

రవాణ శాఖ మంత్రి పేర్ని నాని

అమరావతిః ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ వేశామని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.శాసన మండలిలో మాట్లాడుతూ .. 90 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.ముందుగా ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.అద్దె బస్సులను ఒప్పందం ప్రకారం పరిమితి పూర్తయ్యేవరుకు కొనసాగిస్తామని తెలిపారు.అద్దె బస్సులు ఫిట్‌నెస్‌ లేకపోతే డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆగస్టు నుంచి అంగన్‌వాడీలకు పెంచిన జీతాలు చెల్లింపుఃఆళ్ల నాని
గత ప్రభుత్వం ఆశావర్కర్లను పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు పెంచిన జీతాలు కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు.ఆగస్టు నుంచి ఆశావర్కర్లకు పెంచిన జీతాలు చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటి వరుకు అవయవాల అక్రమ రవాణాపై రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి,నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలపై కేసులు నమోదు చేశామన్నారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి లైసెన్స్‌ రద్దు చేసి మూసివేయించామని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top