విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైన్యం వాలంటీర్ల సేవలను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుళ్లుకుంటున్నారని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. మాట తప్పకుండా ప్రజలకు సీఎం వైయస్ జగన్ సేవ చేస్తున్నారని తెలిపారు. జగనన్న సైన్యానికి మంత్రి శుభాభినందనలు తెలిపారు. సోమవారం పోరంకిలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వైయస్ జగన్ సీఎం అయిన కొత్తలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటే..40 ఏళ్ల ఇండస్ట్రీ ఏమన్నాడు. పేదల పట్ల, సమాజం పట్ల అంకిత భావం కలిగిన 2.40 లక్షల మంది జగనన్న సైన్యం గురించి చంద్రబాబు ఏమన్నారంటే..బ్యాగులు మోసేవారు అన్నారు. కానీ ఈ జగనన్న సైన్యం చేసే పనిని చూసి 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో పింఛన్లు పంపిణీ చేసే సర్వర్లు కూడా ఈ రోజు యాంగ్ అవుతోంది. జగనన్న సైన్యం కాబట్టే ఎత్తుకు పైఎత్తు వేస్తూ తెల్లవారకముందే..కోడి కూయకముందే పింఛన్ల పంపిణీ చేసి 90 శాతం మందికి 9 గంటలలోపే పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్థసారధి..నేను మాట్లాడుకున్నాం. అమ్మ ఒడి అంటున్నారు.. ఎలా సాధ్యమని మాట్లాడుకున్నాం. అంటే మేం జగన్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినా మా ఆలోచనలు అక్కడే ఉండిపోయాయి. ఎవరితో గేమ్స్..జగన్‌మోహన్‌రెడ్డితో గేమ్స్ ఆడటమా? ..వైయస్ జగన్ పేదల పట్ల గుండె నిండ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ధైర్యంతో ఇచ్చిన మాట కోసం మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇవాళ వాలంటీర్లకు ఇచ్చే రూ.125 కోట్లు గౌరవ వేతనం ఇస్తున్నారు. మేం చదువుకునే సమయంలో మాట్లాడుకునే వాళ్లం. పార్థసారధి, నేను ఇద్దరం కాపీ కొట్టి మా నియోజకవర్గంలో అమలు చేసేవాళ్లం. కానీ ఇవాళ వైయస్ జగన్ అమలు చేసే కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.నేను ఇంజినీరింగ్ చేరితే..సారధి కూడా ఇంజినీరింగ్‌లో చేరారు. మా నాన్న ఇచ్చే డబ్బులు ప్యాకేట్ మనీకి సరిపోయేది కాదు. డబ్బులు సరిపోవడం లేదని మా నాన్నకు ఉత్తరాలు రాసేవాళ్లం. వైయస్ జగన్ వాలంటీర్లను నియమించే సమయంలో సేవా దృక్పథం ఉన్న వారు ఈ వ్యవస్థలోకి రావాలని చెప్పారు. మంచి ఉద్యోగం వస్తే వెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారు. మాలాంటి వాళ్లను రావద్దని కూడా చెప్పాడు. మాట తప్పకుండా ప్రజలకు సీఎం వైయస్ జగన్ సేవ చేస్తున్నారు. తిరుపతిలో ఇంటింటా ప్రచారం చేస్తున్న సమయంలో ఒకాయన నన్ను కలిశారు. సార్ నాకు పింఛన్ వస్తోంది. ఇప్పుడు ఆగింది..నేను ఎవరిని అడగాలి అన్నారు. నేను వెంటనే అడ్మిన్‌కు ఫోన్ చేశాను. ఎందుకు పింఛన్ ఆగిందని అడిగాను. ఆ తరువాత ఆ పెద్దాయనను మీ కార్పొరేటర్ ఎవరని అడిగితే గుర్తు లేదన్నారు. మీ వాలంటీర్ ఎవరంటే..వెంటనే పేరు చెప్పారు. పేదవాడికి ఆడ్మిన్ పేరు తెలియదు. ఎందుకు పథకం ఆగిందో తెలియదు. పౌరుడికి వాలంటీర్ పేరు తెలుసు. వెంటనే వాలంటీర్‌ను అడిగితే..సార్..ఆయన పేదోడే కానీ..1700 చదరపు అడుగుల ఇళ్లు ఉంది కాబట్టి పింఛన్ రావడం లేదని వాలంటీర్ చెప్పాడు. వైయస్ జగన్ వాలంటీర్లను నమ్ముకుంటే..ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పేరు తెలియదేమో కానీ,,వాలంటీర్ పేరు చెప్పని ఇళ్లు లేదని గర్వంగా చెప్పగలను. ఇవాళ సీఎం నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.