ఉద్యోగాల కల్పనే కానీ.. తొలగింపు ఉండదు

మంత్రి పేర్ని నాని
 

తాడేపల్లి: తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పనే గాని, తొలిగింపు ఉండదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆర్టీసీ లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని మంత్రి  వెల్లడించారు. వారికి కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వాడాలని సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు.  దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. కరోనా వలన ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక సంక్షోభం వలన మాత్రమే జీతాలు చెల్లించలేకపోయామన్నారు. ఎవరినీ తొలగించబోమని... యథావిధిగా కొనసాగుతారని పేర్కొన్నారు. 

Back to Top