ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం వస్తుందని భావిస్తున్నాం

మంత్రి పేర్ని నాని
 

విజయవాడ: ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం వస్తుందని మంత్రి పేర్ని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు నుంచి ఉద్యోగులకు మేలు చేయాలని చెబుతున్నారని గుర్తు చేశారు. అందుకే మంత్రుల కమిటీ వేశారని తెలిపారు. నిన్న రాత్రి ఉద్యోగులతో చర్చలు సానుకూలగా జరిగాయని మంత్రి చెప్పారు. ఈ రోజు పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు నష్టం జరిగేలా ప్రభుత్వం చేయదన్నారు. హెచ్‌ఆర్‌ఏ సహా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top