రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు

జిల్లాల వారీగా అభివృద్ధిపై చర్చించాం

ఈ నెల 17న మరోసారి హైపవర్‌ కమిటీ సమావేశం

మంత్రి పేర్నినాని

సచివాలయం: రాజధాని రైతల సమస్యలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలియజేవచ్చు అని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. రైతులు నేరుగా కమిషనర్‌ను కలవవచ్చని, సీఆర్‌డీఏ ఈ-మెయిల్‌ ద్వారా రైతుల సందేహాలు తెలియజేయవచ్చని సూచించారు. ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, కన్నబాబు మీడియాకు వివరించారు. పేర్నినాని మాట్లాడుతూ.. జిల్లాల వారిగా ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందో అన్ని అంశాలను చర్చిస్తూ..మరోసారి 17వ తేదీ మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నాం. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుందరికీ ఎవరెవరికి  ప్రభుత్వానికి ఏమి చెప్పాలనుకుంటున్నారో రాతపూర్వకంగా సీఆర్‌డీఏ కమిషనర్‌కు 15వ తేదీ 5 గంటల లోపు వ్యక్తిగతంగా లేక సీఆర్‌డీఏ కమిషనర్‌ మెయిల్‌ ఐడీకి రైతుల సూచనలు, సందేహాలు ప్రభుత్వానికి చెప్పవచ్చు. జనవరి 17వ తేదీ తదుపరి సమావేశం నిర్వహిస్తాం.
రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకొని లబ్ధి పొందేందుకు అమయాకులైన మహిళలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వాడుకుంటున్నారు. వాస్తవంగా నిజమైన రైతులకు మేం చెప్పేది అర్థమైంది. రైతులతో పాటు రాజకీయంగా ప్రేరెపించిన వారు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆందోళనల్లో  అసాంఘిక శక్తులు కలిశాయి. పథకం ప్రకారం పోలీసులను రెచ్చగొట్టేవిధంగా, కెమెరాల ముందు సానుభూతి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతులతో చర్చలు జరుపుతున్నాం. మంత్రుల వద్దకు వచ్చి రైతులు కలుస్తున్నారు.  
 

Back to Top