ఏలూరు నుంచే వాహనమిత్ర ప్రారంభం

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
 

 

పశ్చిమగోదావరి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చుతున్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఏలూరు జరిగిన పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారని, ముఖ్యమంత్రి హోదాలో రేపు ఏలూరులోనే వాహనమిత్ర కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారన్నారు. వాహనమిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో కలిసి మంత్రి పేర్ని నాని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారందరికీ ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top