జల జీవన్‌ మిషన్‌తో 240 గ్రామాలకు తాగునీరు

నెల్లూరులో మంత్రుల బృందం పర్యటన

నెల్లూరు: తుమ్మలపెంటలో రూ.64 కోట్లతో నిర్మించిన జల జీవన్‌ మిషన్‌తో నెల్లూరు జిల్లాలోనే 240 గ్రామాలకు తాగునీటి సమస్య తీరిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రుల బృందం శనివారం పర్యటించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, గౌతంరెడ్డిలు శంకుస్థాపనలు చేశారు. కావలిలో రూ.85 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్‌ ల్యాబ్‌ను మంత్రులు ప్రారంభించారు. ఆముదాలదిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్‌ డ్రైన్‌ను ప్రారంభించారు. తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకేలను మంత్రులు ప్రారంభించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top