జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక ప్రత్యేక కూపన్లు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కూపన్లు జారీ చేస్తున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక, మినరల్‌ కన్సెషన్‌ అప్లికేషన్లు, మైనింగ్‌పై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇకపై జిల్లాల వారీగా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సీనరేజీ కనెక్షన్లు ఇవ్వనున్నాం. వాల్యూమెట్రిక్‌ బదులు వెయిట్‌ బేసిన్‌లో సీనరేజ్‌ వసూళ్లకు ప్రణాళిక తీసుకొస్తున్నాం. జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లు అందిస్తున్నాం. మైనర్‌ మినరల్స్‌ లీజులను ఈ–ఆక్షన్‌ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శాస్తీ్రయ విధానంలో మైనింగ్‌ లీజుల పెంపుదలకు యోచన చేస్తున్నట్టు’ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top