దిగ్విజయంగా ఉపాధి హామీ పథకం

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
 

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం దిగ్విజ‌యంగా అమ‌ల‌వుతుంద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాస‌న స‌భ‌లో ఉపాధి హామీ ప‌థ‌కం పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆమోదించిన లేబర్‌ బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్రంలో 23 కోట్ల 50 లక్షల పనిదినాలకు గాను 22 కోట్ల 45 లక్షల పనిదినాలు కల్పించామని చెప్పారు.

45 లక్షల 83 కుటుంబాల నుంచి 75 లక్షల 32 వేల మందికి ఉపాధి కల్పించామని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7507.54 కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం కోసం వెచ్చించామని తెలిపారు. ఇందులో రూ.4908.09 కోట్లను వేతనాల కోసం, 2504.65 కోట్ల రూపాలయలను మెటీరియల్‌ కాంపొనెంట్‌ కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. 3,82,130 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేశాయని పేర్కొన్నారు. వేతనదారులకు 99.27 శాతం చెల్లింపులు 15 రోజుల్లో పూర్తయ్యాయని సభా ముఖంగా మంత్రి వివరాలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top