సచివాలయంలో అన్ని రకాల సేవలు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

అమరావతి: సచివాలయంలో అన్ని రకాల సేవలు అందుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలోనే జరిగే పరిస్థితి ఉందన్నారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకు మూడు విడతలు ఇచ్చామని చెప్పారు. వైయస్‌ఆర్‌ బీమా కింద ఇప్పటి వరకు రూ,129.90 కోట్లు ఇచ్చామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ప్రతి పౌరుడికీ ఇంటి వద్దే పరిపాలన అందించే సౌకర్యం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కల్పించారన్నారు. కోవిడ్‌ సమయంలోనూ వాలంటీర్లు సేవలు అందించారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అనేక సేవలందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top