చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. 

మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు 
 

చిత్తూరు:  పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేడని.. ఆయ‌న‌ ఓ రాజకీయ వికలాంగుడు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులను ముందుగా ఊహించిందే.. ఇంకా అధిక సీట్లు సాధిస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారని, జుట్టు అందలేదని కాళ్లు పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. వైయ‌స్ జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారని.. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తాం… తిరిగి అధికారంలోకి వచ్చాక న్యాయరాజధాని ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

  వైయ‌స్ఆర్‌సీఈప‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న నంద్యాలలో, 29న ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభలు నిర్వహించనున్నామని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజలకు వివరిస్తారన్నారు. మేమంతా సిద్ధం సభ సక్సెస్ అవుతుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top